Youtuber Harsha Sai : ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి (Youtuber Harsha Sai) కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. తనను హర్షసాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసాడని చెప్పి బిగ్ బాస్ ఫేమ్ , OTT నటి మిత్రా శర్మ పిర్యాదు లో పేర్కొంది. హర్షసాయి తో పాటు అతడి తండ్రి రాధాకృష్ణ ఫై కూడా ఫిర్యాదులో పేర్కొంది. హర్ష తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి దాదాపు రూ. 2 కోట్లు తన దగ్గరి నుండి తీసుకున్నాడని..ఇప్పుడు డబ్బులు అడిగిన , పెళ్లి గురించి ప్రస్తావన తీసుకొచ్చిన ముఖంచాటేస్తున్నారని.. అలాగే తనను బ్లాక్ మెయిల్ చేయడం తో పాటు శారీరకంగా వాడుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.
తామిద్దరం ‘మెగా’ సినిమా చేశామని , ఈ మూవీ కాపీ రైట్స్ కోసం హర్ష పట్టుబడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. సినిమాకు బాధితురాలు నిర్మాతగా వ్యవహరించింది. మత్తుమందు ఇచ్చి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్టు.. ఫిర్యాదులో రాసుకొచ్చింది. ఆ సమయంలో వీడియోలు తీసి.. కాపీరైట్స్ ఇవ్వకపోతే వీడియోలు వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్‌లో తెలిపింది.
ఈమె పిర్యాదు స్వీకరించిన పోలీసులు హర్షసాయి ఫై 376(2), 376N, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ప్రస్తుతం సాయి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నాల్గు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. హర్షసాయి సొంతూరు వైజాగ్ లో గాలించగా అక్కడ లేడని..ప్రస్తుతం ముంబై లో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లినట్లు సమాచారం. మరోపక్క ఈ కేసుపై హర్షసాయి నోరు విప్పాడు. డబ్బు కోసమే తప్పుడు ఆరోపణలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. నా గురించి మీకు తెలుసు.. త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయి అని పేర్కొన్నాడు. తనపై వచ్చిన ఆరోపణలకు తన అడ్వకేట్ సమాధానం చెబుతారని వెల్లడించాడు.
Read Also : World Pharmacist Day : ప్రపంచ ఫార్మసిస్ట్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?