Drugs Case : డైరెక్టర్ క్రిష్ కోసం పోలీసుల గాలింపు

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. సోమవారం గచ్చిబౌలి(Gachibowli )లోని రాడిసన్‌ హోటల్‌(Radisson Hotel) ఫై పోలీసులు దాడి జరుపగా.. భారీగా డ్రగ్స్‌ దొరికాయి. డ్రగ్స్ తీసుకుంటున్న బిజెపి నేత(Politician) కుమారుడు గజ్జల వివేకానందతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు పొందుపర్చారు. ‘ఈ కేసులో ఏ-10 నిందితుడిగా ఉన్న డైరెక్టర్ క్రిష్ పరారీలో ఉన్నారు. We’re now on […]

Published By: HashtagU Telugu Desk
Director Krish

Director Krish

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. సోమవారం గచ్చిబౌలి(Gachibowli )లోని రాడిసన్‌ హోటల్‌(Radisson Hotel) ఫై పోలీసులు దాడి జరుపగా.. భారీగా డ్రగ్స్‌ దొరికాయి. డ్రగ్స్ తీసుకుంటున్న బిజెపి నేత(Politician) కుమారుడు గజ్జల వివేకానందతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు పొందుపర్చారు. ‘ఈ కేసులో ఏ-10 నిందితుడిగా ఉన్న డైరెక్టర్ క్రిష్ పరారీలో ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటికే ఆయనకు CrPc160 నోటీసులు జారీ చేశాం’ అని కోర్టుకు రిపోర్టు చేశారు. కాగా ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు FIRలో చేర్చారు. ఏ11గా వివేక్ డ్రైవర్ ప్రవీణ్, ఏ12గా డ్రగ్ సప్లయర్ మీర్జా వహీద్ బేగ్ పేర్లను చేర్చారు. వివేక్ అనే వ్యక్తి గత ఏడాదికి డ్రగ్స్‌కు బానిసయ్యాడని తెలుస్తోంది. అతనితో పాటు డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ సింధీ కూడా ఆ హోటల్‌లో డ్రగ్స్ తీసుకున్నారని చెబుతున్నారు. ఫిబ్రవరి 24న డ్రగ్స్ పార్టీ జరిగిందని, అందులో క్రిష్‌తో పాటుగా శ్వేత, లిస్సీ, నీల్ వంటి వారున్నారని చెబుతున్నారు.

Read Also : Tecno Spark 20C: మార్కెట్ లోకి కొత్త టెక్నో స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్?

  Last Updated: 29 Feb 2024, 10:25 AM IST