సినీ నటుడు మోహన్ బాబు (Mohan Babu)ను అరెస్ట్ (Mohan Babu Arrest) చేయడంలో ఎలాంటి ఆలస్యం లేదని, చట్ట ప్రకారం విచారణ కొనసాగుతోందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు (Rachakonda Police Commissioner Sudhir Babu) స్పష్టం చేశారు. ఈ కేసు విషయంలో మోహన్ బాబును విచారించేందుకు ముందు మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. మోహన్ బాబుకు ఇప్పటికే నోటీసులు అందించామని, అయితే ఆయన డిసెంబర్ 24 వరకు సమయం కోరారని సీపీ తెలిపారు. కోర్టు కూడా దీనికి అనుకూలంగా సమయం ఇచ్చిందని అయితే ఆ తేదీ తరువాత కూడా నోటీసులకు స్పందించకపోతే తప్పనిసరిగా అరెస్ట్ చేస్తామని కమిషనర్ హెచ్చరించారు.
మోహన్ బాబుతో సంబంధం ఉన్న గన్స్ విషయమై సీపీ వివరణ ఇచ్చారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఆ గన్స్ లేవని, అవి చిత్తూరు జిల్లా చంద్రగిరిలో డిపాజిట్ చేయబడ్డాయని తెలిపారు. ఈ విషయం కోర్టు ముందుకు కూడా వచ్చిందన్నారు. చట్ట ప్రకారం తగు సమయానికే అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అటు మోహన్ బాబు తన లైసెన్స్ గన్‌ను పోలీసులకు అప్పగించారు. ఈరోజు సోమవారం హైదరాబాద్ నుంచి ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని తన యూనివర్సిటీకి వెళ్లారాయన. అనంతరం చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో తన డబుల్ బ్యారెల్ లైసెన్స్‌డ్ గన్‌ను పీఆర్ఓ ద్వారా డిపాజిట్ చేయించారు.