Site icon HashtagU Telugu

PM Modi: కాంతార సినిమా చూడనున్న ప్రధాని మోదీ.. ఎప్పుడంటే..?

Modi 9

Modi 9

కాంతార ఈ మూవీ ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్టన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. విడుదలైన అన్ని భాషలలో ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ మూవీ సినీ ప్రముఖులు, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు పొందింది. అయితే ఈ మూవీని దేశ ప్రధాని నరేంద్ర మోదీ చూడబోతున్నారు.

రిషబ్ శెట్టి హీరోగా నటించి తెరకెక్కించిన కాంతార చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ కన్నడ సినిమా అక్కడ కంటే తెలుగులో మంచి వసూళ్లను రాబడుతోంది. అయితే దేశ వ్యాప్తంగా ప్రజల మన్నలను అందుకున్న ఈ సినిమాను భారత ప్రధాని మోదీ కూడా వీక్షించనున్నట్లు సమాచారం. నవంబర్ 14న ప్రధాని మోదీ, రిషబ్‌తో కలిసి చూడనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఇటీవల విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా కాంతార భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతున్న ఈ సినిమా విడుదలైన రోజు నుంచి సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికీ హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో సందడి చేస్తుంది. ఈ మూవీని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ అక్టోబర్ 15న రిలీజ్ చేశారు.