Narendra Modi : ‘నాటు నాటు’ సాంగ్ గురించి అమెరికా వైట్‌హౌస్ లో మాట్లాడిన మోదీ..

తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) నాటు నాటు సాంగ్ గురించి మాట్లాడారు.

Published By: HashtagU Telugu Desk
PM Modi

PM Modi speakes about Naatu Naatu song in America White House

RRR సినిమా, అందులోని నాటు నాటు(Naatu Naatu) సాంగ్ ప్రపంచమంతా ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికి తెలిసిందే. RRR సినిమాని, రాజమౌళి(Rajamouli)ని హాలీవుడ్(Hollywood), ప్రపంచమంతా పొగిడేసింది. ఇక సినిమాకి 1100 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. నాటు నాటు సాంగ్ ప్రపంచంలోనే అత్యున్నత సినీ పురస్కారం ఆస్కార్(Oscar) సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఇప్పటికి కూడా ప్రపంచంలో ఏదో ఒక మూల నాటు నాటు సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది. ఎవరో ఒకరు నాటు నాటు సాంగ్, RRR సినిమా గురించి మాట్లాడుతున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) నాటు నాటు సాంగ్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం ప్రధాని అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అమెరికా వైట్ హౌస్ లో అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన విందులో పాల్గొన్నారు నరేంద్ర మోదీ. ఈ విందులో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. రోజులు మారుతున్న కొద్దీ ఇండియన్స్, అమెరికన్స్ ఒకరి జీవన శైలి గురించి ఇంకొకరు బాగా తెలుసుకుంటున్నారు. ఇండియాలోని పిల్లలు హాలోవీన్, స్పైడర్ మ్యాన్ లను ఇష్టపడుతుంటే ఇక్కడి యువత నాటు నాటు సాంగ్స్ కి స్టెప్పులు వేయడానికి ఇష్టపడుతున్నారు అని అన్నారు.

దీంతో మోదీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారగా RRR చిత్రయూనిట్ మోదీ మాట్లాడిన వీడియోని షేర్ చేస్తూ.. ఒకరి సంస్కృతి ఒకరు తెలుసుకోవడం వల్ల వారి మధ్య బలమైన బంధం ఏర్పడుతుంది. ఇండియా మరియు అమెరికా మధ్య మంచి బంధం అభివృద్ధి చెందుతుందని మేము నమ్ముతున్నాం అని ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మోదీ నాటు నాటు గురించి అమెరికా వైట్ హౌస్ లో మాట్లాడటంతో RRR అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Also Read : Samosa Caucus-Modi : సమోసా కాకస్ అని మోడీ చెప్పగానే.. అమెరికా ఎంపీల చప్పట్లు ఎందుకు ?

  Last Updated: 23 Jun 2023, 06:51 PM IST