Janhvi Kapoor: అలనాటి తార దివంగత శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ హాట్ ఫేవరట్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ఓ పక్క హీరోయిన్‌గా నటిస్తూ మరోపక్క హాట్ హాట్ ఫొటోషూట్‌లతో కుర్రకారును ఆకట్టుకుంటున్న ఈ బామకు సోషల్‌మీడియాలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు తన జీవితంలో జరిగే సంఘటనలు, తన షూటింగ్ అప్‌డేట్స్, టూర్ ఫొటోస్ ఇలా తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఈ అమ్మడు తన అభిమానులతోపంచుకుంటూ ఉంటుంది.
అయితే స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బామకు తరచూ విమర్శలు, ట్రోల్స్ ఎదురవుతుండడంతో తాజాగా ఈ విషయాలపై మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది. తనపై వచ్చే ట్రోల్స్ చూసి ఆమ విసిగిపోయినట్లు ఈ సందర్భంగా తెలిపింది. తను ఎంత కష్టపడినా ఏదో ఒక తప్పు వెతికి ట్రోల్ చేస్తున్నారని వాపోయింది. ‘మనం ఏం చేసిన, ఎంత కష్టపడినా కొందరు అందులో తప్పులు వెతుకుతూ ఉంటారు. ఎప్పుడు సూటిపోటి మాటలతో బాధపెడుతుంటారు అని ఈ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ట్రోల్స్ గురించి చెబుతూ బాధపడింది.
వారు మనల్నీ ట్రోల్ చేసి సంతోషం పొందుతారని, అదే వారికి ఆనందంగా ఉంటుందని తెలిపింది. మనపై చేసే కామెంట్స్‌తో వార్తల్లో నిలిచేందుకు వారు ఉత్సాహం చూపిస్తారని పేర్కొంది. ఇది నిరంతరం కానసాగతూనే ఉంటుందని.. ఇలాంటి వార్తలు చదివి, చదివి కొంతకాలానికి ప్రజలు విసిగిపోతారని ఆమె చెప్పుకొచ్చింది. తన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాటి నుండి విమర్శలు ఎదుర్కుంటూ ఉన్నానని ఆమె బాధపడింది. నెపోకిడ్ అంటూ కొందరు ట్రోలింగ్ చేస్తారని కూడా ఈ ఇంటర్వ్యూలో తెలిపింది.
తన సినిమా రిలీజైనప్పుడల్లా ‘నెపోకిడ్.. నటన రానప్పుడు ఎందుకు సినిమాలు చేస్తున్నావు?’ అని కామెంట్స్ చేయడం చూసి తను చాలా ఆవేదనకు గురైన్నట్లు ఆమె పేర్కొంది. ఇప్పుడు ఇప్పుడు ట్రోలింగ్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదని.. సోషల్‌మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్ చూసి నవ్వుకుంటున్నాని, తన బలాలు, బలహీనతలు, తను ఎలా నటిస్తున్నానో తెలుసుకున్నానని కాబట్టి, వాళ్ల వ్యాఖ్యలు పట్టించుకోకూడదని అర్థమైందని ఆమె తనపై జరిగే ట్రోలింగ్ గురించి మాట్లాడింది.