Site icon HashtagU Telugu

Sai Pallavi: మహేశ్ కోసం మారువేశం!

Saipallavi

Saipallavi

ఫిదా ఫేం సాయి పల్లవి, రానా దగ్గుబాటి నటించిన ‘విరాట పర్వం’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే సాయిపల్లవి మారువేషంలో ఓ థియేటర్ హాలులో ప్రత్యక్షమైన ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. నిన్న ఆదివారం ఉదయాన సాయి పల్లవి ముఖం, తలపై స్కార్ఫ్‌తో కవర్ చేసుకొని సాధారణ డ్రెస్సింగ్ లో కనిపించింది. ఇటీవల విడుదలైన మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాను బంజారాహిల్స్‌లోని ఓ థియేటర్‌లో సాయి పల్లవి చూసినట్టు సమాచారం. సినిమా స్క్రీనింగ్ సమయంలో ఆమెను ఎవరూ గమనించలేదని తెలుస్తోంది. కానీ ఆమె బయటకు వెళ్లిన సమయంలో కొంతమంది గుర్తు పట్టారు. నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించిన సాయి పల్లవి గతంలో కూడా మారువేషంలో తన సినిమాని థియేటర్‌లో చూసింది. అంతేకాదు.. గతంలో అర్జున్ రెడ్డి సినిమాను కూడా తన ఫెండ్స్ తో కలిసి చూసింది సాయిపల్లవి.