నేచురల్ స్టార్ నాని అంటేనే సహజమైన పాత్రలు కళ్లముందు కదలాడుతాయి. కథలకు తగ్గట్టుగానే ఆయన లుక్స్ అలానే ఉంటాయి. తాజాగా మరో కొత్త లుక్ తో ఆశ్చర్యపర్చాడు నాని. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం నాని దసరా సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో నాని తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడతాడు. మాస్ అప్‌డేట్‌ను ప్రకటిస్తూ టీమ్ పోస్టర్‌ను విడుదల చేసింది.
లుంగీ కట్టుకుని నడుస్తున్నప్పుడు, నాని కాళ్లు మాత్రమే మనకు కనిపిస్తాయి. అతని నడుముకి రెండు మద్యం సీసాలు కట్టి ఉండడం కూడా చూడొచ్చు. పోస్టర్‌తోనే కథలోని కరుకుదనం, నాని పాత్రను అంచనా వేయొచ్చు. నాని యాక్షన్ సీన్స్ దుమ్మురేపేలా ఉంటాయని మాస్ అభిమానులు భావిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్‌పై దసరా చిత్రం రూపొందుతోంది.