Site icon HashtagU Telugu

Pic Talk: బాస్ తో ‘భాయ్’.. సల్మాన్ కు చిరు స్వాగతం!

Chiru

Chiru

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు అధికారికంగా తెలిసింది. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షూటింగ్‌లో సల్మాన్ ఖాన్ జాయిన్ అయ్యాడు. సల్మాన్ కు ఇది టాలీవుడ్ అరంగేట్రం. ఇద్దరు అతిపెద్ద సూపర్‌స్టార్లు మొదటిసారిగా స్క్రీన్ ను షేర్ చేసుకోవడం పట్ల గాడ్‌ఫాదర్ టీమ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంది.

‘‘సల్మాన్ ఖాన్‌కి స్వాగతం! మీ ఎంట్రీ ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచింది. మరింత ఉత్సాహం పెరిగింది. మీతో స్క్రీన్‌ను పంచుకోవడం ఒక సంపూర్ణమైన ఆనందం. మీ ఉనికి ప్రేక్షకులకు అద్భుతమైన కిక్‌ని ఇస్తుందనడంలో సందేహం లేదు’’ అని ట్వీట్ చేసిన చిరు సల్మాన్‌తో కలిసి ఉన్న చిత్రాన్ని కూడా పంచుకున్నారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన లూసిఫర్‌కి అధికారిక రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ స్టార్‌డమ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. చిరు సోదరిగా నయనతార నటిస్తుండగా, సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్,  సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తుది దశకు చేరుకుంది. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందించారు.