శివకార్తికేయన్ (Shivakarthikeyan) హీరోగా నటించిన అమరన్ (Amaran ) సినిమా థియేటర్ పై బాంబుల దాడి (Petrol bombs hurled ) జరిగింది. ఈ దాడి తో ప్రేక్షకులు భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటన తమినాడులో చోటుచేసుకుంది. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని అమరన్ సినిమా ప్రదర్శన జరుగుతున్న థియేటర్‌పై ఈ ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబ్ లతో దాడి చేసారు. ఈ ఘటన తో ప్రేక్షకులు భయంతో పరుగులుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు ధృవీకరించారు. మరోవైపు ఈ దాడికి కారణం స్థానిక గొడవలే కారణమని తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తీకేయన్, లేడీ పవర్‌స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకొచ్చింది. స్వర్గీయ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కోలీవుడ్ అగ్ర కథనాయకుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్‌తో పాటు సోని పిక్చర్స్‌తో కలిసి సంయుక్తంగా అమరన్‌ను దాదాపు రూ. 130 కోట్ల పైగా బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. విడుదలైన రెండు వారాలకు గాను అమరన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 263.40 కోట్ల గ్రాస్.. రూ.129.75 కోట్ల షేర్ రాబట్టి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు రూ.62.75 కోట్ల లాభాలను అందించింది. ఈ ఏడాది తమిళ చిత్ర పరిశ్రమలో రిలీజైన సినిమాల్లో హయ్యెస్ట్ వసూళ్లను సాధించిన చిత్రాల్లో ఒకటిగా అమరన్ నిలిచింది. ఒకవైపు సూర్య ‘కంగువ’ మూవీ తమిళనాడులోనూ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ‘అమరన్’ థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా ప్రదర్శించబడుతోంది.
ఇక అమరన్ తెలుగు వెర్షన్ పదిహేను రోజుల్లో 35 కోట్లకుపైగా గ్రాస్ , 20 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది తెలుగులో అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన డబ్బింగ్ మూవీగా నిలిచింది. స్ట్రెయిట్ సినిమాకు ధీటుగా తెలుగులో ప్రమోషన్స్ చేయడం, సాయిపల్లవికి ఉన్న క్రేజ్ అమరన్‌కు తెలుగులో బాగా కలిసివచ్చింది. కేవలం ఐదు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ నిర్మాతలకు పదిహేను కోట్లు లాభాలను తెచ్చిపెట్టినట్లు సమాచారం.
Read Also :Triple IT : విద్యార్థుల ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి : బండి సంజయ్