R Narayana Murthy : ప్రజాచైతన్యం కోసం సామజిక సమస్యలు పై విప్లవాత్మక సినిమాలు చేస్తూ పీపుల్ స్టార్ అనే బిరుదుని సంపాదించుకున్న నటుడు ఆర్ నారాయణమూర్తి. ఈ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడుతూ, చాలా హుషారుగా ఉండే నారాయణమూర్తి.. ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారనే వార్త అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. స్వల్ప అనారోగ్యానికి గురైన నారాయణమూర్తి.. హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నారాయణమూర్తి సన్నిహితులు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.
నారాయణమూర్తి ఆరోగ్యం బాగోలేదని, ఆయనని హాస్పిటల్లో అడ్మిట్ చేశామని సన్నిహితులు తెలియజేసారు. డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో నారాయణమూర్తికి చికిత్స జరుగుతుందని, ఆయన కోలుకుంటుంటున్నారని చెబుతూ.. కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు, తెలుగు ఆడియన్స్.. నారాయణమూర్తి త్వరగా కోలుకొని తిరిగిరావాలని కామెంట్స్ చేస్తున్నారు.
కాగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన నారాయణమూర్తి.. పలు చిత్రాలకు దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే ప్రస్తుతం ఆయన సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అడపాదడపా ఒకటిరెండు సినిమాలతో ఆడియన్స్ ని పలకరిస్తున్నారు.