People Media Factory ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో భారీ సినిమాలను నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులోనే కాదు తమిళంలో కూడా రంగ ప్రవేశం చేసింది. తెలుగులో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ తమిళంలో మొదటి ప్రాజెక్ట్ ని రిలీజ్ చేశారు. ఎప్పుడు మొదలు పెట్టారో తెలియదు కానీ సడెన్ గా ఈ బ్యానర్ నుంచి ఒక తమిళ సినిమా రిలీజైంది.
స్టార్ కమెడియన్ సోలో హీరోగా చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితా అందుకుంటున్నాయి. ఈ క్రమంలో అతనితో ఒక సినిమా చేశారు పీపుల్ మీడియా నిర్మాతలు. కార్తీక్ యోగి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. సంతానం హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వడక్కుపత్తి రామస్వామి అనే టైటిల్ పెట్టారు.
ఈ ఫ్రై డే రిలీజైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. పెద్ద బడ్జెట్ సినిమా కాకపోయినా తమిళంలో మొదటి వెంచర్ తోనే నిర్మాతలు మంచి ఫలితాన్నీ అందుకున్నారని చెప్పొచ్చు. సంతానం సినిమా అంటే అక్కడ మినిమం గ్యారెంటీ అనే టాక్ ఉంది. దానికి తగినట్టుగానే కథ కథనాలు రాసుకుని సినిమాను హిట్ చేసుకున్నారు. ఈ సినిమా హిట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వరుసగా తమిళంలో కూడా సినిమాను నిర్మించాలని అనుకుంటున్నారు.