Yash: యశ్ ఇంటి ముందు భారీ క్యూలలో జనాలు.. ఎందుకోసం అంటే?

సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని జనాలు కలుసుకోవడానికి ఎప్పుడూ ఆసక్తిని చూపిస్తుంటారు.

  • Written By:
  • Publish Date - February 2, 2023 / 08:32 PM IST

Yash: సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని జనాలు కలుసుకోవడానికి ఎప్పుడూ ఆసక్తిని చూపిస్తుంటారు. తమ అభిమాన హీరోను కలుసుకోవడానికి అయితే ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. అయితే తాజాగా ఓ సినీ హీరో ఇంటి ముందు జనాలు భారీ క్యూలలో ఎదురుచూస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలా తన కోసం క్యూలలో నిలబడి ఉన్న ప్రతి ఒక్కరిని సదరు హీరో కలిసి, వారితో ఫోటోలు దిగాడు.

కేజీఎఫ్ పేరుతో ఓ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం మన అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ చాప్టర్ 1, 2 పేర్లతో రెండు సినిమాలు రాగా.. ఈ సినిమాల్లో రాకీ బాయ్ గా అందరినీ కన్నడ నటుడు యశ్ ఆకట్టుకోవడం తెలిసిందే. సినిమా మరో లెవల్ హీరోయిజం ను ప్రేక్షకులకు అందించగా.. ఈ సినిమా రికార్డుల సునామీని క్రియేట్ చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా అయితే దేశవ్యాప్తంగా ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.

అయితే కన్నడ నాట యశ్ ను ఎంతో మంది అభిమానిస్తుంటారు. అలాంటి వాళ్లంతా ఆయనను కలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. తాజాగా యశ్ ఇంటి ముందు భారీగా క్యూలైన్లలో జనాలు వేయి ఉన్న వీడియోలో నెట్టింట వైరల్ అయ్యాయి. భారీ క్యూ లైన్లలో ఎంతో పద్ధతిగా జనాలు ఎదురుచూస్తే, వారిలో ప్రతి ఒక్కరిని యశ్ కలుసుకోవడంతో పాటు వారితో ఫోటోలు కూడా దిగాడు.

జనవరి 8వ తేదీన పుట్టినరోజు సందర్భంగా యశ్ కొత్త ప్రాజెక్ట్ గురించి క్రేజీ అప్ డేట్ వస్తుందని అందరూ ఊహించారు. కానీ యశ్ మాత్రం ‘నేను ఓ క్రేజీ ప్రాజెక్టు కోసం ఆసక్తిగా పని చేస్తున్నా. ప్రస్తుతానికి దాని వివరాలు చెప్పలేను. ఓపిక పట్టండి. మిమ్మల్ని నిరాశ పరచను’ అని ట్వీట్ చేశాడు. అలాగే ‘నేను ప్రస్తుతం ఇక్కడ (కర్ణాటక) లేను. మిమ్మల్ని కలుసుకోలేను’ అని ట్వీట్ చేశాడు. తాజాగా విదేశాల నుండి తిరిగి వచ్చిన యాశ్ ను కలుసుకునేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఆయన ఇంటికి చేరుకోగా… వాళ్లందరినీ యశ్ కలుసుకున్నాడు.