Pelli Choopulu : ‘పెళ్ళి చూపులు’ సినిమాలో డ్రెస్ కలర్స్ తో కూడా కథ నడిపిన తరుణ్ భాస్కర్..

దర్శకుడు పాయింట్ అఫ్ వ్యూలో మరో బ్యాక్ స్టోరీ కూడా ఉంది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Pelli Chupulu Movie Interesting Story running with Dresses said by Tharun Bhascker

Pelli Chupulu Movie Interesting Story running with Dresses said by Tharun Bhascker

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రీతూ వర్మ(Reethu Varma) హీరో హీరోయిన్స్ గా నటిస్తూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘పెళ్లి చూపులు'(Pelli Choopulu). తరుణ్ భాస్కర్(Tharun Bhascker) తెరకెక్కించిన ఈ చిత్రం లవ్ కామెడీ ఎంటర్‌టైనర్ గా అలరించి మెప్పించింది. కేవలం రెండు కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 30 కోట్ల వరకు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అంతేకాదు రెండు నేషనల్ అవార్డులు, నంది అవార్డులతో పాటు పలు ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను కూడా అందుకుంది.

ఇక ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే చాలా సింపుల్ స్టోరీ. లైఫ్ మీద క్లారిటీ లేని ఒక కుర్రాడి జీవితంలోకి లైఫ్ మీద పిచ్చ క్లారిటీ ఉన్న అమ్మాయి వస్తే.. ఆ కథ ఎలా ఉంటుంది అనేది చాలా సింపుల్‌గా, నేచురాలిటీకి దగ్గరగా తెరకెక్కించారు. స్క్రీన్ పై ఆడియన్స్ అంతా చూసింది ఈ స్టోరీనే. అయితే దర్శకుడు పాయింట్ అఫ్ వ్యూలో మరో బ్యాక్ స్టోరీ కూడా ఉంది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చారు.

సినిమాలో గమనిస్తే.. హీరో ‘బ్లూ షేడ్’ కాస్ట్యూమ్స్ లో కనిపిస్తాడు. ఇక హీరోయిన్ ఏమో.. ‘రెడ్, ఎల్లో అండ్ ఆరెంజ్’ కాంబినేషన్ కాస్ట్యూమ్స్ తో కనిపిస్తూ ఉంటుంది. కానీ సినిమా ప్రీ క్లైమాక్స్ ముందుకు వచ్చేప్పటికి హీరో ఆరెంజ్ కాస్ట్యూమ్స్‌కి, హీరోయిన్ బ్లూ కాస్ట్యూమ్స్‌కి చేంజ్ అవుతారు. ఇది చాలామంది గమనించి ఉండరు. ఈ కాస్ట్యూమ్స్ వెనుక ఓ స్టోరీ ఉంది.

హీరో చాలా నార్మల్‌గా సింపుల్‌ లైఫ్‌లో, ఓపెన్‌గా ఉంటూ ఉంటాడు. దానిని తెలిపేలా బ్లూ కాస్ట్యూమ్స్ ఉపయోగించారు. హీరోయిన్ విషయానికి వస్తే.. రెడ్ డ్రెస్ వేసినప్పుడు చాలా కోపంగా ఉన్న సీన్స్, హీరో గ్యాంగ్ తో వర్క్ చేస్తున్నప్పుడు ఎల్లో అండ్ ఆరెంజ్ కాస్ట్యూమ్స్ లో కనిపిస్తూ ఉంటుంది. అయితే వారిద్దరి ప్రేమలో పడిన తరువాత.. ఒకరికి ఒకరు కలర్స్ చేంజ్ చేసుకుంటారు. సినిమాలో ఈ సబ్ కాన్షియస్ స్టోరీని నడిపించానని తరుణ్ భాస్కర్ తెలిపాడు.

 

Also Read : Mahesh Babu : మహేష్ బాబు చేయాల్సిన సినిమా.. తరుణ్ చేశాడు..

  Last Updated: 18 Mar 2024, 12:25 PM IST