గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా 18 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. 2007లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన ‘చిరుత’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన రామ్ చరణ్, తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘చిరుత’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా, రామ్ చరణ్‌కి భవిష్యత్తులో స్టార్ హీరోగా నిలదొక్కుకునే బలమైన పునాది వేసింది. ఈ 18 ఏళ్లలో ఆయన అనేక బ్లాక్‌బస్టర్ సినిమాలతో అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు.
Good News : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..తగ్గనున్న కరెంట్ ఛార్జీలు
ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ద’(Peddi) మూవీ టీమ్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ కథలో రామ్ చరణ్ కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, ఇద్దరి కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. రామ్ చరణ్ ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో కనిపించనున్నారని చిత్రబృందం తెలిపింది.
ఈ చిత్రానికి ప్రపంచ ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ స్వరాలు అందిస్తుండటం మరో ప్రత్యేకత. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌లు సినిమాపై హైప్‌ను పెంచాయి. 18 ఏళ్ల కెరీర్‌లో తన ప్రతిభతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ నుంచి ఈ సినిమా మరొక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.