Site icon HashtagU Telugu

Peddi Glimpse : ‘పెద్ది’ గ్లింప్స్ లీక్ చేసిన రామ్ చరణ్

Peddi Glimpse Leak

Peddi Glimpse Leak

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న తాజా పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’(Peddi)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బుచ్చిబాబు(Buchhibabu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లు అభిమానుల నుండి విశేష స్పందనను తెచ్చుకున్నాయి. అయితే ముందుగా అనుకున్న గ్లింప్స్ విడుదల వాయిదా వేయడంతో ఫ్యాన్స్‌లో చిన్న నిరాశ నెలకొంది. కానీ తాజాగా శ్రీరామనవమి సందర్భంగా గ్లింప్స్ (Peddi Glimpse) రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించగా, రామ్ చరణ్ స్వయంగా ఈ విషయాన్ని షేర్ చేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచారు.

CS Post : సీఎస్ పదవికి శాంతి కుమారి రాజీనామా ?

ఏప్రిల్ 6 ఉదయం 11:45 గంటలకు ‘పెద్ది’ గ్లింప్స్ ని ‘ఫస్ట్ షాట్’ పేరుతో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ ‘‘గ్లింప్స్ చూసిన తర్వాత నాకు చాలా ఎగ్జైట్ ఫీలయ్యింది. మీకు కూడా ఇది ఖచ్చితంగా నచ్చుతుంది’’ అంటూ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఏఆర్ రెహమాన్ స్టూడియోలో సౌండ్ మిక్సింగ్ జరుగుతున్న దృశ్యాలు కనిపించగా, దర్శకుడు బుచ్చిబాబు అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల రెహమాన్ స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో గ్లింప్స్ రిలీజ్ ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫైనల్ మిక్సింగ్ పూర్తవ్వడంతో అన్ని భాషల్లో ఒకేసారి గ్లింప్స్ విడుదల కానుంది.

రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ‘పెద్ది’లో రామ్ చరణ్ ఊర మాస్ లుక్‌లో కనిపించగా, ఆయన సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అంతేకాదు శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు లాంటి కీలక నటులు కూడా ఇందులో భాగమవుతుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.