Site icon HashtagU Telugu

Peddi : పెద్ది ఫస్ట్ ప్రోమో..ఇది కదా రహమాన్ నుండి కోరుకుంటుంది !!

Chikiri Peddi

Chikiri Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, గ్రామీణ నేపథ్యంలో సాగే భావోద్వేగ కథగా తెరకెక్కుతోంది. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన పొందాయి. రామ్ చరణ్ సరికొత్త లుక్‌లో కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సినిమాపై హైప్ పెంచేందుకు మేకర్స్ ఇప్పుడు ఫస్ట్ సింగిల్ విడుదలకు సన్నాహాలు పూర్తి చేశారు.

Vote Chori : హరియాణాలో 25 లక్షల ఓట్ల చోరీ – రాహుల్

ఈ చిత్రంలోని తొలి పాటగా ‘చికిరి చికిరి’ అనే సాంగ్‌ను విడుదల చేయబోతున్నారు. రెండు రోజులుగా “చికిరి అంటే ఏమిటి?” అంటూ సోషల్ మీడియాలో ఆసక్తి రేపిన చిత్ర బృందం, ఇప్పుడు దాని అర్థాన్ని వెల్లడించింది. “అలంకరణ అవసరం లేని సహజ సౌందర్యం గల ఆడపిల్లను ముద్దుగా చికిరి అని పిలుస్తారు” అని వివరించారు. ఈ సాంగ్ ప్రోమోలో రామ్ చరణ్ తన ఎనర్జీతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్‌లతో మెస్మరైజ్ చేశారు. గ్రామీణ వాతావరణంలో సాగే ఈ పాటలో చరణ్ స్టైలిష్ మూమెంట్స్, సంప్రదాయ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాటలో మధురమైన ఫోక్ టచ్ కనిపిస్తుంది. ప్రముఖ గాయకుడు మోహిత్ చౌహాన్ గానం చేసిన ఈ సాంగ్‌కి బాలాజీ లిరిక్స్ రాశారు. ప్రోమోలోనే రామ్ చరణ్ సిగ్నేచర్ స్టెప్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసేసింది. పూర్తి లిరికల్ వీడియోను నవంబర్ 7న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సాంగ్‌తో ‘పెద్ది’ సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరగడం ఖాయం. రెహమాన్ మ్యూజిక్, చరణ్ డ్యాన్స్, బుచ్చిబాబు విజన్ — ఈ త్రయం కలయికతో ‘పెద్ది’ సినిమా తెలుగు సినిమాకు మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Exit mobile version