గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పీరియాడిక్ చిత్రం ‘పెద్ది’. ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలవనుందని ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6న విడుదల చేసిన ‘ఫస్ట్ షాట్ గ్లింప్స్’ (Peddi First Shot Glimpse) అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో చరణ్ “ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాల.. మళ్లీ పుడతామా ఏంటి?” అంటూ చెప్పిన డైలాగ్స్ పూనకాలు పుట్టిస్తుంది. గ్లింప్స్ చివర్లో బ్యాట్ పట్టుకుని సిక్సర్ కొట్టే సీన్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేసేలా చేసింది. ఇక రహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వీడియో కు మరింత హైప్ తెచ్చింది.
BJP Formation Day : బీజేపీ 45 వసంతాలు.. కమలదళం ఎలా ఏర్పాటైందో తెలుసా ?
ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ రైట్స్‌ను ప్రముఖ సంస్థ టీ సిరీస్ దక్కించుకుంది. అయితే ఎంత మొత్తానికి తీసుకుందో తెలియజేయలేదు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమా కొన్ని సీన్ల కోసం నెగిటివ్ రీల్ ఉపయోగించినట్లు వెల్లడించారు. దాని వల్ల సన్నివేశాలు మరింత నేచురల్‌గా, థియేట్రికల్‌గా కనబడతాయని చెప్పారు. ఇటీవలి ‘దేవర’లోనూ ఈ టెక్నిక్ ప్రయోగించామని పేర్కొన్నారు. ఈ సాంకేతిక ప్రయోగాలు సినిమాకు ఓ ప్రత్యేకమైన విజువల్ ఫీల్ ఇవ్వనున్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ (A R Rahman) ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాను మర్చి 27 , 2026లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.