మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు (Ram Charan Birthday) ఈరోజు. ఈ సందర్బంగా ఆయన కొత్త చిత్రం యొక్క ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను రిలీజ్ చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. రామ్ చరణ్ – బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ఈ మూవీ కి ‘పెద్ది’ (Peddi) అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ (Peddi First Look) ను రిలీజ్ చేసారు. ఈ లుక్ లో రామ్ చరణ్ రఫ్ లుక్, గుబురు గడ్డం, చెవులకు రింగుల తో కనిపించాడు. అంతే కాదు ఈ ఫస్ట్ లుక్ లో బీడీ వెలిగిస్తున్న తీరు, ఆ కంట్లో కనిపిస్తున్న పొగరు, తెగువ, ధైర్యం ఇవన్నీ కూడా అదిరిపోయాయి. బ్యాట్ పట్టుకుని రామ్ చరణ్ కనిపిస్తున్న తీరు చూస్తే అంతా ఫిదా అవ్వాల్సిందే.
Army Chief Vs Army : పాక్ ఆర్మీ చీఫ్‌పై తిరుగుబాటు ? ఇమ్రాన్ ఖాన్‌కు మంచి రోజులు !
రామ్ చరణ్ గతంలో “రంగస్థలం” సినిమాలో బుచ్చిబాబు టేకింగ్ ను అద్భుతంగా ప్రదర్శించారు. ఇప్పుడు “పెద్ది” లో ఆయన పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందని అంచనా వేయొచ్చు. ఇదే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ట్రై చేస్తున్నట్లు సమాచారం. మొదట రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ ఇవ్వాలని అనుకున్నారు, కానీ ఏఆర్ రెహ్మాన్ హెల్త్ ఇష్యూస్ కారణంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ సినిమా క్యాస్టింగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ కన్నడ నటుడు శివన్న, బాలీవుడ్ యాక్టర్ దివ్యేందు శర్మ, అలాగే సీనియర్ నటుడు జగ్గూ భాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ ఎంపిక కావడం సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. బుచ్చిబాబు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు భారీ స్థాయిలో ప్రిపరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
BHIM 3.0 App: గుడ్ న్యూస్..నెట్ వేగం తక్కువగా ఉన్నా ఆన్‌లైన్ చెల్లింపులు!