Site icon HashtagU Telugu

Anasuya : పెదకాపు-1.. అనసూయ బోల్డ్ అటెంప్ట్..!

Pedakapu 1 Anasuya Bold Dia

Pedakapu 1 Anasuya Bold Dia

జబర్దస్త్ యాంకర్ Anasuya బుల్లితెరకు బై బై చెప్పి వెండితెర మీద వరుస సినిమాలతో తన హవా కొనసాగిస్తుంది. చేస్తున్న సినిమాల్లో తన పాత్రకు కచ్చితంగా వెయిట్ ఉండేలా చేసుకుంటున్న అనసూయ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తుంది. సినిమాలో అనసూయ ఉంది అంటే ఆమెది కచ్చితంగా ప్రత్యేకమైన రోల్ అనేలా ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకుంది. అడపాదడపా కొద్దిగా అటు ఇటు ఉన్న పాత్రల్లో కూడా నటిస్తూ కెరీర్ నెట్టుకొస్తుంది.

అనసూయ లేటెస్ట్ మూవీ పెదకాపు 1 మరో వారం రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్పెషల్ చిట్ చాట్ చేశారు. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలనే యాంకరింగ్ చేస్తూ ఈ ఇంటర్వ్యూ నడిపించారు. పెదకాపు హీరో విరాట్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జే మేయర్ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు తో పాటుగా అనసూయ కూడా ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఈ చిట్ చాట్ లో భాగంగా సినిమాకు సంబంధించిన అన్ని విషాలను ప్రస్తావించారు.

ఈ క్రమంలో అనసూయ (Anasuya) పాత్ర గురించి మాత్రం చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు. సినిమాకు విరాట్ కనిపించడానికి హీరో కానీ అసలు కథకు హీరో అనసూయే అని శ్రీకాంత్ అడ్డాల చెప్పారు. సో అనసూయ పాత్ర ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెప్పొచ్చు. అంతేకాదు ఈ సినిమాలో అనసూయ చేత ఒక బోల్డ్ డైలాగ్ కూడా చెప్పించాడట శ్రీకాంత్ అడ్డాల. అంతకుముందు చాలా సెన్సిబుల్ సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీకాంత్ అడ్డాల తన పంథా మార్చేసి పెదకాపు అంటూ పొలిటికల్ మూవీతో వస్తున్నారు.

పెదకాపు 1 అంటూ డేరింగ్ స్టెప్ వేస్తున్న శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా రిజల్ట్ మీద చాలా నమ్మకంగా ఉన్నారు. విరాట్ ప్రగతి లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్ అడ్డాల నటించడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు.

Also Read : Rashmika : పాపం.. ‘శ్రీవల్లి’ని పట్టించుకునే నాధుడే లేకుండాపోయాడు

Exit mobile version