Site icon HashtagU Telugu

Mangalavaram: ఆసక్తి రేపుతున్న మంగళవారం ట్రైలర్, వరుస హత్యలపై థ్రిల్లింగ్స్

Mangalavaram

Mangalavaram

Mangalavaram: ‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మంగళవారం’. పాయల్ రాజ్‌పుత్ ఒక ప్రధాన పాత్రలో నటించారు. ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ మరో ప్రధాన పాత్రధారి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 17న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ.ఎం నిర్మిస్తున్నారు. ఇది గ్రామీణ ప్రాంతంలో జ‌రిగే మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ. అనేక పాత్ర‌లు, మేక వ‌న్నె పులులు, వ‌రుస హ‌త్య‌లు… వాటి వెనుక ఉన్న ర‌హ‌స్యం.. ఇదే సినిమా క‌థ‌. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీల్లో థ్రిల్లింగ్స్ ఎలిమెంట్స్ క‌నిపించ‌డం స‌ర్వ సాధార‌ణం.

అయితే.. ఈ సినిమాలో ఇంటెన్సిటీ కూడా తీవ్రంగా చూపించే ప్రయ‌త్నం చేశాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ట్రైల‌ర్ అంతా సీరియ‌స్ టోన్‌లో సాగింది. కొన్ని విజువ‌ల్స్ .. వారెవా అనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో ద‌మ్ముంది. కాంతార చిత్రానికి నేప‌థ్య సంగీతం అందించిన అజ‌నీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి బ‌లం. సౌండ్ డిజైనింగ్ కి కూడా చాలా ప్రాధాన్యం ఇచ్చారు. పాయ‌ల్ రాజ్‌పుత్‌, శ్రీ‌తేజ్‌, చైత‌న్య కృష్ణ‌, అజ‌య్ ఘోష్‌… ఇలా చాలా పాత్ర‌లే క‌నిపిస్తున్నాయి. విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అజయ్ భూపతి-పాయల్ కాంబినేషన్ హిట్ కొడుతుందా లేదా అని వేచి చూడాల్సిందే.

Exit mobile version