Site icon HashtagU Telugu

Payal Rajput: నెటిజన్ ట్వీట్ కు.. పాయల్ స్ట్రాంగ్ కౌంటర్

New Project (12)

New Project (12)

Payal Rajput: సెలబ్రిటీలన్నాక.. ఎప్పుడూ ఎవరో ఒకరు ఏదొక కామెంట్ చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. నెటిజన్లు నెగిటివ్ గా కామెంట్స్ చేయడం మరింత పెరిగింది. ఆ ఏఐ పుణ్యమా అని.. ఇటీవల డీప్ ఫేక్ వీడియోలు, డీప్ ఫేక్ ఫొటోలతో కొత్త తలనొప్పి కూడా మొదలైంది. హీరోయిన్స్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రోల్ చేయడం, అసభ్యంగా కామెంట్ చేయడం వంటివి చేస్తుంటారు. ఒక్కోసారి అలాంటి కామెంట్స్, ట్రోల్స్ కు గట్టిగానే కౌంటర్లిస్తుంటారు.

తాజాగా పాయల్ రాజ్ పుత్ కూడా.. తనపై కామెంట్ చేస్తూ వీడియో షేర్ చేసిన ఓ నెటిజన్ కు అదిరిపోయే కౌంటరిచ్చింది. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో ఇటీవలే విడుదల చిత్రం మంగళవారం. ఈ సినిమాలో పాయల్ గ్లామర్ డోస్.. ఆర్స్ ఎక్స్ 100 రేంజ్ లో ఉందని సినిమా చూసిన వారంతా చెబుతున్నారు. అజయ్ భూపతి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ మంగళవారం సినిమాలోని ఒక బోల్డ్ క్లిప్ ను ఎక్స్ లో షేర్ చేసి.. ఆమె లో దుస్తుల గురించి కామెంట్ చేశాడు. దానికి పాయల్ రాజ్ పుత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ లో-దుస్తులు నావి కావని, ప్రొడక్షన్ వాళ్లు ఇచ్చినవని పాయల్ రిప్లై ఇచ్చింది. ఆ నెటిజన్ కు బాగా రిప్లై ఇచ్చావ్ అంటూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

https://x.com/starlingpayal/status/1725139174058070271?s=20

https://x.com/ViaanSharma0210/status/1729117815595225362?s=20

Exit mobile version