Site icon HashtagU Telugu

Payal Rajput : పాయల్ రాజ్ పుత్.. సీన్ ఇలా రివర్స్ అయ్యిందేంటి..?

Payal Rajput Rakshana Movie Issue Scene Reverse For Heroine

Payal Rajput Rakshana Movie Issue Scene Reverse For Heroine

Payal Rajput ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ ఆ తర్వాత సినిమాల్లో అదే గ్లామర్ డోస్ తో నటించినా సరైన సక్సెస్ అందుకోలేదు. రీసెంట్ గా మంగళవారం సినిమాతో మరోసారి తన టాలెంట్ చాటిన పాయల్ లేటెస్ట్ గా ఓ సినిమా గురించి కంప్లైంట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టింది.

ఎప్పుడో చేసిన సినిమాకు ఇప్పుడు ప్రమోషన్స్ చేయమంటున్నారని.. తన ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకే ఇలా చేస్తున్నారని. వారు చెప్పినట్టు చేయకపోతే తెలుగు సినిమాల నుంచి బ్యాన్ చేస్తున్నామని బెదిరిస్తున్నారని సోషల్ మీడియాలో వ్యక్తపరిచింది పాయల్ రాజ్ పుత్.

అయితే ఈ విషయంపై నిర్మాతల మండలి నుంచి రెస్పాన్స్ వచ్చింది. పాయల్ తో నాలుగేళ్ల క్రితం రక్షణ అనే సినిమా చేశారు దర్శక నిర్మాత ప్రాణదీప్ ఠాకూఒర్. ఆ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఐతే సినిమా రిలీజ్ చేద్దామని అనుకుంటే పాయల్ అందుకు సహకరించడం లేదని నిర్మాతలు చెబుతున్నారు.

అంతేకాదు ఆ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేసుకోమని సలహా ఇస్తుందని వారు వెల్లడించారు. పాయల్ తమకు 50 రోజుల డేట్స్ ఇంకా ప్రమోషన్స్ లో పాల్గొంటానని అగ్రిమెంట్ చేసింది. 47 రోజులు షూటింగ్ పూర్తైంది. ఆమె డబ్బింగ్ ఇంకా ప్రమోషన్స్ కోసం మిగిలిన మొత్తం 6 లక్షలు చెక్ కూడా అందించాం. ఆమె వాటికి వస్తే ఆ చెక్ క్లియర్ చేస్తామని నిర్మాత చెబుతున్నారు.

కెరీర్ మొదట్లో చేసిన సినిమా కాబట్టి వద్దంటుందా లేదా పాయల్ కావాలని ఇలా చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. నిర్మాతల మండలి నుంచి పాయల్ కు వార్నింగ్ వచ్చింది కాబట్టి ఈ విషయంలో ఆమె కన్విన్స్ అవ్వక తప్పదని చెప్పొచ్చు.

Also Read : Rukshar Dhillon : రుక్సర్ మెరుపులు చూశారా.. స్టార్ హీరోయిన్ కటౌట్ కానీ..?