తెలుగు ప్రేక్షకులకు ‘RX 100’ సినిమాతో పరిచయమైన నటి పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ (67) జూలై 28న కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. తండ్రి మరణ వార్త తెలుసుకున్న పాయల్ తట్టుకోలేకపోయింది. సోషల్ మీడియాలో “నాన్నా” అంటూ గుండె పగిలిన ఎమోజీతో చేసిన పోస్ట్ ఆమె బాధను తెలియపరుస్తుంది.
తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై గతంలోనే పాయల్ స్పందించిన విషయం తెలిసిందే. క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమోథెరపీ జరుగుతోందని, తన తండ్రి కోలుకోవాలని ప్రార్థనలు చేయాలని అభిమానులను కోరారు. కానీ అన్ని ప్రయత్నాలు వృథా అయ్యాయి. తన తండ్రి మరణంతో పాయల్ భావోద్వేగానికి గురై, తాను చేయగలిగినంత చేశానని, కానీ క్యాన్సర్‌ను ఓడించలేకపోయామని అన్నారు. “క్షమించు నాన్నా… లవ్యూ” అంటూ చేసిన పోస్ట్ నెటిజన్ల గుండెను తాకింది.
Betting apps case : ఈడీ విచారణకు హాజరైన నటుడు ప్రకాశ్‌రాజ్
పాయల్ పోస్ట్ చూసిన పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు ధైర్యం చెప్పారు. నటి రాయ్ లక్ష్మీ, దివి, పాయల్ ప్రియుడు సౌరభ్ వంటి వారు పాయల్‌కు మద్దతుగా నిలిచారు. ‘‘నీ బాధ మేము ఊహించగలం… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం… నీకు దేవుడు శక్తి ఇవ్వాలి’’ అంటూ పాయల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పాయల్ చేసిన పోస్ట్ ఎమోషనల్‌గా నెట్టింట్లో వైరల్‌గా మారింది.
చిత్రసీమలో పాయల్ రాజ్‌పుత్ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ‘RX 100’ తర్వాత విక్టరీ వెంకటేష్‌తో ‘వెంకీ మామ’, రవితేజ సరసన ‘డిస్కో రాజా’, అలాగే ఇటీవల అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘మంగళవారం’ చిత్రంలో కీలక పాత్ర పోషించారు.