Site icon HashtagU Telugu

Payal Rajput : ఈసారి పోలీసాఫీసర్ గా అదరగొట్టబోతున్న పాయల్ రాజ్‌పుత్..

Payal Rajput

Payal Rajput

Payal Rajput : పాయల్ రాజ్‌పుత్.. ఓ ఆపక్క కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూనే కంటెంట్ సినిమాలతో అదరగొడుతుంది. Rx100 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్ ఇటీవల ‘మంగళవారం’ సినిమాలో అదరగొట్టే పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని మెప్పించి సూపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు పోలీసాఫీసర్ గా రాబోతుంది పాయల్ రాజ్‌పుత్.

పాయల్ రాజ్‌పుత్ మెయిన్ లీడ్ లో రోషన్, మానస్, రాజీవ్ కనకాల, వినోద్ బాల.. ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘రక్షణ’. క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ మాట్లాడుతూ.. క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామాగా రక్షణ సినిమాని తెరకెక్కిస్తున్నాం. పాయల్ రాజ్‌పుత్‌ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా సరికొత్తగా కనిపించబోతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటనతో ఈ కథని రాసుకొని సినిమా తీస్తున్నాం. ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా షూటింగ్ చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేస్తాం అని తెలిపారు. మరి పోలీసాఫీసర్ గా పాయల్ రాజ్‌పుత్ ఎలా మెప్పిస్తుందో చూడాలి.

 

Also Read : Ashwin Babu : పాన్ ఇండియా హీరోగా మారబోతున్న అశ్విన్ బాబు..