Site icon HashtagU Telugu

Pawan Kalyan : అయోమయంలో పవన్ నిర్మాతలు..?

Pawan Producers

Pawan Producers

సినీ నటుడు , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను నమ్ముకొని ముగ్గురు నిర్మాతలు అయోమయంలో పడ్డారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే చాలు..ఇక ఏది అవసరం లేదని. చిత్రసీమలో ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ సినిమాను ప్రొడ్యూస్ చేయడం , లేదా డైరెక్ట్ చేయాలనీ అనేకమంది అనుకుంటుంటారు..కానీ ఇది గతం..ఇప్పుడు పవన్ తో సినిమా అంటే వామ్మో అనుకునే పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయాలు , మరోపక్క సినిమాలు చేస్తూ ఏది కరెక్ట్ గా కొనసాగించలేకపోతున్నారు. అటు రాజకీయాలు చేయలేక , ఇటు ఒప్పుకున్నా సినిమాలు పూర్తి చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాదు పవన్ తో సినిమాలు మొదలుపెట్టిన నిర్మాతలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు.

ముందుగా నిర్మాత ఏ ఎం రత్నం (AM Ratnam)..గతంలో ఖుషి , బంగారం వంటి సినిమాలు నిర్మించిన రత్నం..అంటే పవన్ కళ్యాణ్ కు ఎంతో అభిమానం..ఆయనకు కూడా అంతే..ఈ అభిమానమే అయన తో ఓ సినిమా చేసేలా చేసింది. క్రిష్ (Krish) డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు (Harihara Veeramallu ) మూవీ స్టార్ట్ చేశారు. నిజానికి పదేళ్ల క్రితమే ఏ ఏం రత్నం పవన్ కళ్యాణ్ కి అడ్వాన్స్ ఇచ్చారు. అది తిరిగి తీసుకోమని పవన్ కళ్యాణ్ ఒకటికి రెండుసార్లు ఏం రత్నానికి చెప్పినా ఆయన తీసుకోలేదు. పవన్ బాబుతో సినిమా చేయాల్సిందేనని పట్టుదలతో హరిహరవిరమల్లు మొదలుపెట్టారు. మూడేళ్ల క్రితం మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సగం లోనే నిలిచిపోయింది. విప్లవకారుడిగా, మల్ల యోధుడిగా పవన్ కళ్యాణ్ ఏదో చేసేస్తాడు ఈ మూవీలో అనుకుంటే.. మొత్తానికి మూల పడింది. పవన్ కళ్యాణ్ ను నమ్ముకున్నందుకు డైరెక్టర్ క్రిష్ కెరీర్ కూడా అయోమయంలో పడిపోయింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఆర్ఆర్ఆర్ ఫేమ్ దానయ్య (DVV Danayya) నిర్మాతగా సుజిత్ డైరెక్షన్ లో OG సినిమా స్టార్ట్ చేసారు. శరవేగంగా షూటింగ్ కూడా జరుపుకుంది. గ్లిమ్స్ రిలీజ్ సినిమాపై అంచనాలు పెంచారు. పోస్ట్ ప్రొడక్షన్ అయిపోద్ది రేపు మాపో రిలీజ్ అన్నారు. కానీ ఎటు కాకుండా ఆగిపోయింది ఈ మూవీ. పవన్ కళ్యాణ్ ను నమ్ముకున్నందుకు ప్రొడ్యూసర్ దానయ్య .. డైరెక్టర్ సుజిత్ (Sujith) ఇద్దరు కూడా ఏం చేయాలో అర్థం కాక మరో సినిమా ఛాన్స్ రాక పిచ్చి చూపులు చూస్తున్నాడు. ఇక చివరిది ఉస్తాద్ భగత్ సింగ్. స్టార్ ప్రొడ్యూసర్ మైత్రి మూవీస్ (Mytri Movie Makers) అధినేత నవీన్ 10 సంవత్సరాల క్రితం..12 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ ఇచ్చాడు. హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో పవన్తో మూవీ స్టార్ట్ చేశారు.

ఇది కూడా సగం షూటింగ్ పూర్తయి..ఇప్పుడు ఆగిపోయింది. పవన్ అంటే ఎంతో అభిమానం ఉండే డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ కి నచ్చ చెప్పే ధైర్యం లేక అన్ని మూసుకొని కూర్చున్నాడు. ఈ ముగ్గురు కూడా ఇప్పుడు తెచ్చిన అప్పు కు వడ్డీలు కట్టలేక..సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియక..పవన్ కళ్యాణ్ కు నచ్చ చెప్పలేక వారికీ వారే మనోవేదనకు గురి అవుతున్నారు. ఏంట్రా…మా కర్మ అనుకుంటున్నారు. మొత్తం మీద పవన్ ను నమ్ముకొని ఈ ముగ్గురు నిర్మాతలు ఇప్పుడు అయోమయంలో పడ్డారు.

Read Also : Yadagirigutta New EO : యాదాద్రి నూతన ఈవోగా రామకృష్ణ