Sakshi Vaidya పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం నుండి తప్పుకోవడానికి గల కారణాలను నటి సాక్షి వైద్య వెల్లడించారు. వారం రోజులు షూటింగ్‌లో పాల్గొన్నా, కుటుంబ అత్యవసర పరిస్థితుల వల్ల డేట్లు సర్దుబాటు చేయలేక ఆ అవకాశం వదులుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం శర్వానంద్ సరసన ‘నారీ నారీ నడుమ మురారి’లో ‘నిత్య’ అనే అమాయకపు అమ్మాయి పాత్రలో నటిస్తున్నానని, ఈ సంక్రాంతికి ఈ చిత్రం తనకి మంచి విజయాన్ని అందిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంలో నటించే అవకాశం రావడం ఏ హీరోయిన్ కైనా అదృష్టమే. అటువంటి గోల్డెన్ ఛాన్స్ దక్కించుకొని కూడా, కొన్ని అనివార్య కారణాలతో ఆ సినిమా నుంచి తప్పుకుంది అందాల భామ సాక్షి వైద్య . అఖిల్ అక్కినేని హీరోగా రూపొందిన ‘ఏజెంట్’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘గాండీవధారి అర్జున’ మూవీతో మరో పరాజయాన్ని చవి చూసింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు కష్టమే అనుకున్నారంతా. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ సినిమా ఆఫర్ అమ్మడి తలుపు తట్టింది. కానీ చివరకు ఆ ప్రాజెక్ట్ ను వదులుకుంది.
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాశీ ఖన్నా పాత్ర కోసం మొదట సాక్షి వైద్యను ఎంపిక చేశారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేసింది. ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్ గా ఆమె స్థానంలోకి రాశీ వచ్చి చేరింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాక్షి.. పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పుకోడానికి గల కారణాలను వివరించింది.
ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ కళ్యాణ్ పక్కన నటించే ఛాన్స్ వచ్చినపుడు తాను ఎంతో సంతోషించానని, వారం రోజులు చిత్రీకరణలో కూడా పాల్గొన్నట్లు సాక్షి వైద్య తెలిపింది. అయితే తన ఫ్యామిలీ అత్యవసర పరిస్థితి కారణంగా తాను వేరే ఊరు వెళ్లాల్సి వచ్చిందని, అదే సమయంలో చిత్ర యూనిట్ నుంచి ఫోన్ వచ్చిందని, నెక్స్ట్ డే షూటింగ్ లో పాల్గొనాలని చెప్పారని, కానీ తిరిగి వెళ్లలేని పరిస్థితుల్లో డేట్లు సర్దుబాటుచేయలేక ఆ ప్రాజెక్ట్ వదులుకున్నానని సాక్షి చెప్పింది. భవిష్యత్తులో మళ్లీ ఎప్పుడైనా పవన్‌తో కలిసి నటించే అవకాశం వస్తే వదులుకోనని, అలాంటి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చింది.
సాక్షి వైద్య ప్రస్తుతం శర్వానంద్ సరసన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కానుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ మరో కథానాయిక. ‘ఏజెంట్’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే నిర్మాత అనిల్ తనతో మరో సినిమా చేస్తానని చెప్పారని, ఆయన మాట నిలబెట్టుకున్నారని సాక్షి వైద్య చెబుతోంది. ఇందులో నిత్య అనే క్యారెక్టర్ లో నటించానని, తను నిజాయితీగా ఇన్నోసెంట్ గా కనిపించే అమ్మాయి పాత్రలో కనిపిస్తానని తెలిపింది. శర్వాతో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని, ఆయన కామెడీ టైమింగ్ అద్భుతమని, అతడితో కలిసి పనిచేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని సాక్షి పేర్కొంది.
