పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan ) హీరోగా నటించిన హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరి హర వీరమల్లు’ (Hariharaveeramallu)ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా ‘అసుర హననం’ అనే పవర్‌ఫుల్ పాటను విడుదల చేశారు. ప్రెస్ మీట్‌లో దర్శకులు క్రిష్, జ్యోతికృష్ణ, నిర్మాత ఏఎం రత్నం, సంగీత దర్శకులు పాల్గొని సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Trivikram : త్రివిక్రమ్ పై ఫిర్యాదు పూనమ్ కౌర్ క్లారిటీ
ఈ సినిమా నిర్మాణం వెనుక ఉన్న కష్టాలను నిర్మాత ఏఎం రత్నం వివరించారు. ”ఐదు సంవత్సరాలుగా ఎంతో సమయాన్ని కేటాయించి తీసిన చిత్రం ఇది. కాలాతీతంగా రూపొందిన ఈ చిత్రానికి తక్కువ సమయమే ప్రమోషన్‌కు దొరికింది. కానీ త్వరితగతిన పెద్ద ఈవెంట్లు చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాం” అని అన్నారు. గతంలో తాను నిర్మించిన ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’ వంటి సినిమాల తరహాలోనే, ఈ సినిమాకు కూడా ఓ మంచి సందేశం ఉందని పేర్కొన్నారు.
ZP Office : జగన్ ఫోటో ఎందుకు ఉందంటూ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్
పవన్ కళ్యాణ్‌కి ‘హరి హర వీరమల్లు’ ప్రాజెక్టు ప్రారంభం వెనుక ఉన్న ఆసక్తికర పాయింట్లను రత్నం వెల్లడించారు. పవన్ దర్శకత్వంలో ‘సత్యాగ్రహి’ (Satyagrahi ) సినిమా ప్రారంభమై ఆగిపోయిందని, దాని తాలూకు సంకల్పంతో ఈ చిత్రం ప్రారంభమైందని చెప్పారు. మొదట ‘వేదాళం’ రీమేక్ చేయాలని భావించినా, అది వాయిదా పడింది. ఆ తర్వాత క్రిష్ చెప్పిన వీరమల్లు కథతో పవన్ ఎగ్జైట్ అయ్యాడని తెలిపారు. ఇందులో జ్యోతికృష్ణ ప్రధాన దర్శకుడిగా పనిచేసిన విధానం పట్ల పవన్ కళ్యాణ్ ఎంతో ఆకట్టుకున్నారని అన్నారు. హాలీవుడ్ సినిమాలా ఈ సినిమాకు ఇద్దరు దర్శకులు ఉన్నారని, జ్యోతికృష్ణ ఎంతో నిద్ర లేకుండా పని చేసి అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు.