మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ అటు మలయాళంలో వరుస క్రేజీ సినిమాలు చేస్తూనే ఇటు తెలుగు, తమిళంలో కూడా మంచి మంచి సినిమాల్లో నటిస్తున్నాడు. మహానటి(Mahanati) , సీతారామం సినిమాలతో తెలుగు స్టార్ పాపులారిటీ తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్. అంతేకాదు అతను చేస్తున్న సినిమాలన్నీ హిట్ అవుతుండటంతో దుల్కర్ సల్మాన్ కూడా ఇక్కడ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్ లో లక్కీ భాస్కర్ సినిమాతో రాబోతున్నాడు దుల్కర్ సల్మాన్.
ఈ సినిమాను పీరియాడికల్ ప్రాజెక్ట్ గా అది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేస్తున్నారు. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు దుల్కర్ సల్మాన్. దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) ఈ సినిమా రిలీజ్ అవకుండానే మరో తెలుగు సినిమా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. దుల్కర్ లీడ్ రోల్ లో పవన్ సాధినేని డైరెక్షన్ లో ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమాకు సంబందించిన అప్డేట్ ఈ నెల 27న రాబోతుందని తెలుస్తుంది.
ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో దర్శకుడిగా మారి పలు సినిమాలు డైరెక్ట్ చేసిన పవన్ సాధినేని (Pawan Sadhineni) ఈమధ్య డిస్నీ హాట్ స్టార్ లో వెబ్ సీరీస్ లు చేస్తూ వస్తున్నాడు. దుల్కర్ పవన్ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం కూడా భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారట.
దుల్కర్ తో ఆల్రెడీ సీతారామం సినిమా చేసిన వైజయంతి మూవీస్ ఇప్పుడు మరో సినిమాకు రెడీ అవుతుంది. ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి సినిమా ఎలా ఉండబోతుంది. మిగతా విషయాలన్నీ కూడా ఈ నెల 27న తెలుస్తుంది.
Also Read : Dussehra Release : దసరాని వాళ్లకే వదిలేశారా.. పోటీ పడే కంటే ఆరోజు రావొచ్చుగా..?
