పవర్ స్టార్ పవన్ కళ్యాన్ (Pawan Kalyan) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. పవన్ అనగానే చాలామందికి గుర్తుకువచ్చేది మొదట ఖుషి (Kushi) సినిమానే. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసుకుంది. యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. దాదాపు చాలా ఏళ్ల తర్వాత ఖుషీ (Kushi) సినిమా మళ్లీ పలుకరించబోతోంది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ నూతన సంవత్సర వేడుకల వంటి పర్ఫెక్ట్ పార్టీని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
పవన్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడానికి ఇంతకంటే మంచి సమయం దొరక్కపోవచ్చు. పవన్ కళ్యాణ్ కల్ట్ క్లాసిక్ ఖుషీ (Kushi) ఈ నెల 31న గ్రాండ్ రీరిలీజ్ కాబోతున్నట్లు కన్ఫర్మ్ అయింది. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా పవన్ అభిమానులకు పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్ ముందుకు రాబోతోంది. ఖుషీ ఒక క్లాసిక్ బ్లాక్‌బస్టర్. ఇది PK మార్క్ మూవీ. ఆయన మ్యానరిజమ్స్, పాటలు ఇప్పటికీ హైలైట్ గా నిలుస్తుంటాయి.
ఇప్పటికే పవర్ స్టార్ జల్సా (Jalsa) మూవీ రీరిలీజ్ అయి రికార్డులను తిరుగరాసిన విషయం తెలిసిందే. తాజాగా ఖుషీ సినిమా అలాంటి రికార్డులను బ్రేక్ చేయొచ్చునని భావిస్తున్నారు (Pk Pans) పీకే ఫ్యాన్స్. ఒకవైపు న్యూయర్, మరోవైపు ఇష్టమైన సినిమా రిలీజ్ అవుతుండటం పవన్ అభిమానులు (Fans) ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు.
Also Read: Sridevi Vs Suguna Sundari: టాక్ ఆఫ్ ది టాలీవుడ్.. బాలయ్య, చిరుతో శృతి రొమాన్స్!