గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులకు మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో చెప్పను బ్రదర్..దగ్గరి నుండి మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వకపోవడం వరకు ఇరు ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ ఆ మధ్య సినిమాల్లోని సాంస్కృతిక మార్పులను, కొన్నేళ్లుగా హీరోల చిత్రణను వివరించారు. 40 ఏళ్ల క్రితం హీరోలు అడవులను కాపాడేవారని, ఇప్పుడు సినిమాల్లో చెట్లను నరికి అక్రమ రవాణా చేస్తున్నారని అన్నారు. కన్నడ నటుడు రాజ్‌కుమార్ నటించిన గంధడ గుడి చిత్రంలో అడవుల సంరక్షణ గురించి మాట్లాడారని పవన్ ఎత్తిచూపారు. స్మగ్లర్ల నుంచి అడవిని కాపాడే ఫారెస్ట్ ఆఫీసర్ కథే ఈ సినిమా అని తెలిపారు. “సంస్కృతి ఎలా మారిందో నేను ఇటీవల నా అధికారులతో పంచుకున్నాను. నలభై ఏళ్ల క్రితం అడవులను కాపాడే వాడు వీరుడు. ఇప్పుడు అడవులను నరికి భూమిని నాశనం చేసే వాడిని హీరో అంటారు’’ అని పవన్ అన్నారు. తాను కూడా సినిమా ఫీల్డ్‌లో భాగమేనని, ఇలాంటి సినిమాలు తీయడానికి తరచూ కష్టపడుతున్నానని, ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని పవన్ ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. అల్లు అర్జున్ ను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేసారని బన్నీ ఫ్యాన్స్ పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కొద్దీ రోజుల పాటు ఈ వార్ కొనసాగింది. ఆ తర్వాత చల్లారింది. ఇటీవల మరోసారి అల్లు అర్జున్ ఓ సినిమా ఫంక్షన్ లో చేసిన కామెంట్స్ మరోసారి చర్చకు దారితీసాయి. దీనిపై కూడా అభిమానులు, జనసేన నేతలు స్పందించడం..బన్నీ కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉండగా నిన్న పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా అల్లు అర్జున్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా..’మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు పవర్ స్టార్ & డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు పవన్ కళ్యాణ్ రిప్లై ఇచ్చారు. ’థ్యాంక్స్’ అని బన్నీకి రిప్లై ఇచ్చారు. దీంతో పవన్ – బన్నీ మధ్య విభేదాలు సర్దుమణిగినట్లే అని అంత మాట్లాడుకుంటున్నారు. అభిమానులు కూడా శాంతిచాలని కోరుతున్నారు.
Thank you, @alluarjun , for your warm wishes – @PawanKalyan https://t.co/6gh4AMPvRR
— JanaSena Party (@JanaSenaParty) September 2, 2024
Read Also : Minister Sridhar Babu: ముంపు గ్రామాల్లో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన..రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా