పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న చిత్రాల్లో ‘OG’ ఒకటి. సాహో ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ని DVV దానయ్య నిర్మిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన టీజర్ సంచలనమే సృష్టించింది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ చెపుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్ర కథ ఇదే అంటూ ఐఎండీబీ (IMDB) తెలిపింది.
ఐఎండీబీ (IMDB) తెలిపిన ప్రకారం.. ఓజాస్ గంభీర అనే ఓ టూరిస్ట్ బాయ్ అనుకోకుండా బాంబేకు వచ్చి అక్కడ గ్యాంగ్‌స్టర్ గా మారతాడట. క్రైమ్, మాఫియాలలో రారాజుగా ఎదుగే ప్రయాణంలో తన కుటుంబాన్ని పొగట్టుకుంటాడు. దాంతో తన ఫ్యామిలీని అంతమొందించిన వారిని చంపడానికి రివేంజ్ కోసం.. ఎదురుచూస్తాడు. కేవలం చంపడమే కాకుండా ఆ విలన్ ల సమ్రాజ్యాన్ని కుప్పకూలుస్తాడట. వాళ్లు చేసే ఇల్లీగల్ దందాలన్నిటిని కూకటి వేల్లతో పెకలించేస్తాడు’ అంటూ IMDB రాసుకొచ్చింది. మరి ఇది ఎంత వరకు నిజమో కానీ ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Read Also : Kangana Ranaut: సద్గురు ఇండియాకి కాదు భారత్ కి వస్తారు
ఇక ఈ మూవీ లో ఇమ్రాన్ హస్మి (Emraan Hashmi) విలన్ గా చేస్తున్నట్టు తెలుస్తోంది. మరొకరు కోలీవుడ్ నటి శ్రియారెడ్డి (Sriya Reddy) ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్ లో ఇమ్రాన్ హస్మికి రొమాంటిక్ హీరోగా మంచి పేరు ఉంది. ఇక శ్రియా రెడ్డి ఆల్రెడీ మనకు విశాల్ పొగరు సినిమాతో పరిచయస్తురాలే. అలాంటి వీరిద్దరూ పవన్ కళ్యాణ్ సినిమాలో కనిపించడంతో అభిమానుల అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. అలాగే చిత్రం లో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సమ్మర్ లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తో పాటు పవన్ హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్నాడు.