Shihan Hussaini : పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ ఇక లేరు

షిహాన్‌ హుసైని.. పవన్ కల్యాణ్‌కు(Shihan Hussaini) మార్షల్ ఆర్ట్స్‌ నేర్పారు.ఆయన దగ్గర శిక్షణ పొందాకే పవన్ బ్లాక్ బెల్ట్ సాధించారు.

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan Martial Arts Teacher Shihan Hussaini

Shihan Hussaini : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు మార్షల్‌ ఆర్ట్స్‌, కరాటే, కిక్‌ బాక్సింగ్‌ నేర్పిన కోలీవుడ్‌ నటుడు షిహాన్‌ హుసైని (60) ఇక లేరు. బ్లడ్‌ క్యాన్సర్‌ (లుకేమియా)తో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. షిహాన్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. చెన్నైలో ఆయన అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. షిహాన్‌ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. గతంలో తాను క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయాన్ని షిహాన్‌ హుసైని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం, క్యాన్సర్ చికిత్స కోసం ఆయనకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేసింది.

హుస్సైనీ ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

షిహాన్ హుస్సైనీ మరణంపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ‘‘నేను ఆయన దగ్గరే కరాటే నేర్చుకున్నా. షిహాన్ అనారోగ్యంతో బాధపడుతున్నారని నాలుగు రోజుల కిందటే నాకు తెలిసింది. ఆయనను విదేశాలకు పంపించి మెరుగైన వైద్యం చేయించాలని అనుకున్నాను. ఈ నెల 29న చెన్నైకి వెళ్లేందుకు రెడీ అయ్యాను. ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి రావడం బాధాకరం. హుస్సైనీ గారి ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని పేర్కొంటూ ఓ ప్రకటనను పవన్ కల్యాణ్ విడుదల చేశారు.

Also Read :India Vs Pak : ఆ భూభాగాన్ని పాక్ ఖాళీ చేయాల్సిందే.. ఐరాసలో భారత్

షిహాన్‌ హుసైని గురించి.. 

  • షిహాన్‌ హుసైని.. పవన్ కల్యాణ్‌కు(Shihan Hussaini) మార్షల్ ఆర్ట్స్‌ నేర్పారు.ఆయన దగ్గర శిక్షణ పొందాకే పవన్ బ్లాక్ బెల్ట్ సాధించారు.
  • షిహాన్‌కు ఆర్చరీ కూడా వచ్చు.  ఆర్చరీలో ఆయన దాదాపు 400 మందికిపైగా విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చారు.
  • 1986లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన పున్నగై మన్నన్ సినిమాతో న‌టుడిగా షిహాన్‌ హుసైని అరంగేట్రం చేశారు.
  • హుస్సేని ర‌జ‌నీకాంత్‌తోనూ క‌లిసి పని చేశారు.
  • షిహాన్ నటించిన చివరి సినిమాలు.. కాతువాకుల రెండు కాదల్ , చెన్నై సిటీ గ్యాంగ్ స్టర్స్.
  • సినిమాల‌తో పాటు ప‌లు రియాలిటీ షోలలో న్యాయనిర్ణేతగా, వ్యాఖ్యాతగా షిహాన్ వ్యవహరించారు.
  • విజయ్‌ హీరోగా నటించిన ‘బద్రి’ సినిమాతో షిహాన్‌కు  గుర్తింపు వచ్చింది.

Also Read :Kokapet Lands : కోకాపేటలో బంగారు భూములు.. ఎందుకు ?

డబ్బులు అవసరం ఉన్నంత వరకు నటిస్తూనే ఉంటా : పవన్ కల్యాణ్

తనకు డబ్బులు అవసరం ఉన్నంత వరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటానని పవన్ కల్యాణ్ ప్రకటించారు.  ‘‘నాకు ఆదాయ మార్గం నటన ఒక్కటే. నేను సినిమాలు చేసినంతకాలం వాటికి న్యాయం చేయాలి. నా పరిపాలనకు ఎలాంటి ఆటంకం కలగకుండా కుదిరినప్పుడు డేట్స్ ఇస్తూ నటిస్తాను’’ అని ఆయన వెల్లడించారు. తాజాగా తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఈ వివరాలను తెలిపారు. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు, OG సినిమాలను పూర్తిచేసే పనిలో ఉన్నారు. అయితే వాటికి డేట్స్ ఇవ్వడానికే పవన్ చాలా కష్టపడాల్సి వస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్, సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాకు కూడా పవన్ ఒప్పుకున్నారు.

  Last Updated: 25 Mar 2025, 11:20 AM IST