Site icon HashtagU Telugu

Pawan Kalyan : పవన్ సతీమణి ఇంత సింపుల్‌గా ఉంటారా..? భర్త చెప్పులు పట్టుకొని..!

Pawan Kalyan Wife Anna Lezhneva Life Her Husband Footwear With Hands

Pawan Kalyan Wife Anna Lezhneva Life Her Husband Footwear With Hands

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి ఎంత సింపుల్ గా ఉంటారో అందరికి తెలిసిందే. సినిమాల్లో తనకి ఉన్న అశేషమైన అభిమానం, ఇప్పుడు పాలిటిక్స్ లో ఆయన సంపాదించుకున్న విశేషమైన ప్రజాధారణ.. ఒక సముద్రంతో పోల్చవచ్చు. అయినాసరి పవన్ ఇంకా ఒదిగే ఉంటారు. అయితే పవన్ మాత్రమే కాదు, ఆయన సతీమణి అన్నా లెజనోవా కూడా అంతే సింపుల్ గా ఉంటారని.. తాజాగా రిలీజైన వీడియో చూస్తుంటే అర్ధమవుతుంది.

ఏపీ ఎన్నికల్లో చక్రం తిప్పిన పవన్ కళ్యాణ్.. ఇన్నాళ్లు తన వాళ్ళకి దూరంగా ఉంటూ వచ్చారు. ప్రజలు కోసం పోరాడుతూ తన మెగా ఫ్యామిలీకి దూరమయ్యారు. ఇక ఇప్పుడు రచ్చ గెలిచిన పవన్ కళ్యాణ్.. తన కుటుంబం కోసం తిరిగి వచ్చారు. ఇటీవల ఢిల్లీ NDA సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ నేడు హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఇక రావడంతోనే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి దీవెనల కోసం వచ్చారు.

పవన్ తో పాటు తన సతీమణి అన్నా లెజనోవా, కుమారుడు అకిరా కూడా వచ్చారు. ఇక ఇన్నాళ్లు ఇంటికి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ తిరిగి వస్తుండడంతో.. మెగా కుటుంబం ఘన స్వాగతం పలికింది. పూలవర్షం, గజమల, ఈలలు, కేకలతో మెగా హీరోలు అందరూ పవన్ కి స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో ఒక విషయం అందర్నీ ఆకర్షిస్తుంది.

పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనాదేవికి పాదాభివందనం చేస్తున్న సమయంలో తన చెప్పులను పక్కన విడిచిపెట్టారు. ఇక ఆ చెప్పులను పవన్ భార్య అన్నా లెజనోవా.. చేతులతో తీసుకోని పట్టుకోవడం అందర్నీ ఆకర్షిస్తుంది. ఆ చెప్పులను కాళ్లతో పక్కకి నెట్టొచ్చు. కానీ అక్కడ చుట్టూ పెద్దవాళ్ళు ఉండడంతో ఆమె అలా పట్టుకున్నారని తెలుస్తుంది. తల్లిని గౌరవిస్తూ పవన్ చెప్పులు తియ్యడం, తన భర్త గౌరవానికి మర్యాద ఇస్తూ అన్నా లెజనోవా ఆ చెప్పులను పక్కకి తీసి పట్టుకోవడం అందర్నీ ఆకర్షిస్తుంది. అన్నా లెజనోవా ఒక రష్యన్ అమ్మాయి అని అందరికి తెలిసిందే. అలాంటి ఆమె ఇక్కడి కల్చర్ కి తగ్గట్లు ప్రవర్తించడం అందర్నీ ఆకట్టుకుంటుంది.