Anna Lezhneva : పవన్ కళ్యాణ్ భార్య చదువుకుంటుందా? అన్నా లెజనోవా గ్రాడ్యుయేషన్ ఈవెంట్‌కి పవన్..

అన్నా లెజనోవా యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి ఆర్ట్స్ లో మాస్టర్స్ చేసినట్టు తెలుస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan Anna Lezonova

Pawan Kalyan Anna Lezonova

Anna Lezhneva : పవన్ భార్య అన్నా లెజనోవా ఇటీవల పవన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత బయట ఎక్కువగానే కనిపిస్తుంది. పవన్ గెలుపు సంబరాల్లో, ప్రమాణ స్వీకారంలో అన్నా లెజనోవా పాల్గొంది. దీంతో పవన్ కళ్యాణ్ భార్య ఇటీవల వైరల్ గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజనోవా ఇన్నాళ్లు చదువుకుంటుంది తెలుస్తుంది. ఓ పక్క ఫ్యామిలీని చూసుకుంటూనే మరో పక్క ఆర్ట్స్ గ్రూప్ లో మాస్టర్స్ చేసిందని సమాచారం.

అన్నా లెజనోవా యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి ఆర్ట్స్ లో మాస్టర్స్ చేసినట్టు తెలుస్తుంది. తాజాగా గ్రాడ్యుయేషన్ ఈవెంట్ జరగ్గా అన్నా లెజనోవా ఈ ఈవెంట్లో పాల్గొని పట్టా అందుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాడు. సింగపూర్ లో పవన్ కనపడిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండు రోజుల క్రితం పవన్, అన్నా లెజనోవా ఎయిర్ పోర్ట్ లో కనిపించిన సంగతి తెలిసిందే.

దీంతో అన్నా లెజనోవాని ఈ ఏజ్ లో కూడా చదువుకుంటున్నందుకు, పవన్ లాంటి సెలబ్రిటీ భార్య అయినా చదువుకున్నందుకు అభినందిస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. రోజూ వైట్ అండ్ వైట్ రాజకీయ నాయకుడిగా కనిపించే పవన్ చాలా రోజుల తర్వాత మాములు డ్రెస్ లో కనిపించడంతో పవన్ అభిమానులు కూడా సంతోషిస్తున్నారు.

 

Also Read : Life Threat to Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హత్యకు భారీ కుట్ర.. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక

  Last Updated: 20 Jul 2024, 04:25 PM IST