Site icon HashtagU Telugu

Pawan Kalyan : పవన్ ఇంట విజయ సంబరాలు.. కొడుకు అకిరా వీడియో వైరల్..

Pawan Kalyan Wife Anna Lezhneva Akira Nandan Janasena Winning Celebrations

Pawan Kalyan Wife Anna Lezhneva Akira Nandan Janasena Winning Celebrations

Pawan Kalyan : పదేళ్ల ఆశయం, ఐదేళ్ల నిరీక్షణ నేడు నిజమైంది. జనసైనికులు, మెగా అభిమానులు ఎదురు చూసిన ఆ మధుర క్షణం కళ్ళ ముందుకు వచ్చింది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఏపీ ఎన్నికల్లో.. కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో గెలుపొందింది. ముఖ్యంగా ఈ కూటమిలో జనసేన పార్టీ ఎంతో ప్రభావం చూపించింది. యువతని ఆకర్షించిన పవన్ అత్యధిక పోలింగ్ జరిగేలా చేసారు. ఓటు చీలకుండా, షేరింగ్ అయ్యేలా మంచి ప్లానింగ్ తో ముందు నడిచి, విజయ పతాకాన్ని ఎగుర వేశారు.

గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయి తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్.. ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఆయన మాత్రమే కాదు, ఆయనతో పాటు పోటీ చేసిన ఇతర ఎమ్మెల్యే, ఎంపీలను కూడా మంచి మెజారిటీతో గెలిపించుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. పదేళ్ల నుంచి ఎదురు చూస్తున్న కల నిజమవ్వడంతో జనసైనికులు, మెగా అభిమానులు.. సంతోషంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

ఇక పవన్ గెలుపుతో మెగా ఇంట కూడా సంబరాలు మొదలయ్యాయి. పవన్ సతీమణి అన్నా లెజినోవా.. పవన్ కి విజయ తిలకం దిద్ది హారతు ఇచ్చిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో పవన్ మాజీ భార్య కుమారుడు అకిరా నందన్ కూడా కనిపించడం గమనార్హం. తండ్రి విజయం అకిరా కళ్ళలో కనిపిస్తుంది. పవన్ కి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం అభిమానులు ఇంటికి చేరుకోగా.. అన్నా లెజినోవాతో కలిసి అకిరా కూడా బయటకి వచ్చి అభివాదం చేసారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.