ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) తాజాగా తెలుగు సినీ పరిశ్రమపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఎన్డీయే కూటమి (NDA Govt) ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా, సీఎం చంద్రబాబు(Chandrababu)ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు సినీ ప్రముఖులు ముందుకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అగ్ర నటులు, నిర్మాతలపై ఎలా ఇబ్బందులు పెట్టిందో అప్పుడే మరచిపోతున్నారని ప్రశ్నించారు. వ్యక్తులను చూడకుండా పరిశ్రమ అభివృద్ధిని కాంక్షిస్తున్న తమ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞతా భావం చూపించకపోవడం బాధాకరమన్నారు.
Slot Booking: తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి స్లాట్ బుకింగ్!
ప్రముఖ నిర్మాతలు తమ సినిమాల టికెట్ ధరలు పెంచేందుకు వ్యక్తిగతంగా అర్జీలు ఇస్తూ వస్తున్నారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అయితే ఇకపై వ్యక్తిగత విజ్ఞాపనలకు తావు లేదని, సంబంధిత విభాగ ప్రతినిధులతో మాత్రమే చర్చలు జరుపుతానని స్పష్టం చేశారు. నిర్మాతలు సంఘటితంగా ముందుకు వస్తేనే పరిశ్రమ అభివృద్ధి సాధ్యమవుతుందని మరోసారి గుర్తు చేశారు. సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ‘రిటర్న్ గిఫ్ట్’ను తగిన రీతిలో స్వీకరిస్తానంటూ ఆయన ఘాటుగా హెచ్చరించారు.
ఇతర విభాగాల్లోనూ తన దృష్టిని సారించిన పవన్ కళ్యాణ్, రాష్ట్రంలోని సినిమా హాళ్ల నిర్వహణ, సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. థియేటర్లలో తినుబండారాలు, తాగునీటి సదుపాయాల కొరత, అధిక ధరలపై ప్రేక్షకుల ఫిర్యాదులను పరిశీలించారు. మల్టీప్లెక్స్‌ల నిర్వహణ, టికెట్ ధరలు, ఆహార పదార్థాల ధరలపై కఠినమైన పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. అలాగే సినిమా రంగంలోని 24 విభాగాల్లో నైపుణ్యాభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుందని సమాచారం.