Ramoji Rao : వైజాగ్‌లో ఫిలింసిటీ పవన్ ఆలోచన.. రామోజీ పేరు పెడతామన్న చంద్రబాబు..

తాజాగా వైజాగ్ లో కూడా ఫిలిం సిటీ ప్లాన్ చేయబోతున్నట్టు తెలిపారు

  • Written By:
  • Publish Date - June 28, 2024 / 03:45 PM IST

Ramoji Rao : కొత్తగా ఏర్పడిన ఏపీ ప్రభుత్వం పాలనను పరుగులు పెట్టిస్తుంది. చంద్రబాబు అమరావతి, పోలవరంను టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ ప్రజల గురించి పనిచేస్తున్నారు. పాలనలో కొత్త మార్క్ అయితే కనిపిస్తుంది. ఇక ఏపీ డెవలప్మెంట్ కి కావాల్సిన అన్ని పనులు చేయడానికి రెడీ అవుతున్నారు.

గత ప్రభుత్వంలో సినిమాని, సినిమా వాళ్ళని అంతగా పట్టించుకోలేదు, పైగా సినిమా టికెట్ రేట్లు భారీగా తగ్గించి సినీ పరిశ్రమకు నష్టం చేకూర్చారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏకంగా డిప్యూటీ సీఎం అవ్వడం, సినిమాటోగ్రఫీ శాఖ జనసేనకు ఇవ్వడంతో ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ అగ్ర నిర్మాతలు అంతా పవన్ కళ్యాణ్ ని కలిసి వెళ్లారు.

ఇక ఇటీవల అమరావతిలో ఓ ఫిలిం సిటీ ప్లాన్ చేస్తామని తెలిపారు. తాజాగా వైజాగ్ లో కూడా ఫిలిం సిటీ ప్లాన్ చేయబోతున్నట్టు తెలిపారు. విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ జరగగా ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వైజాగ్ లో ఫిలింసిటీ పెట్టాలనే ఆలోచన పంచుకున్నారు. ఆ ఫిలిం సిటీకి రామోజీ చిత్ర నగర్ అని పేరు పెడతాం అని తెలిపారు. అలాగే అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం. ఒక రోడ్ కి రామోజీ మార్గ్ అని పేరు పెడతాం అని చంద్రబాబు తెలిపారు.

Also Read : Kalki First Day Collections : కల్కి 2898AD ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?