Pawan Kalyan – Thalapathy Vijay: రాజకీయాల్లోకి స్టార్ హీరోలు.. పరిస్థితేంటి ?

పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా తారాస్థాయిలో ఉండగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన జనసేన పార్టీ స్థాపించి పదేళ్లు అవుతుంది. కోలీవుడ్ లో భారీగా క్రేజ్ ఉన్న హీరో విజయ్. ఇప్పుడు ఆయన కూడా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ప్రకటించారు

Pawan Kalyan – Thalapathy Vijay: పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా తారాస్థాయిలో ఉండగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన జనసేన పార్టీ స్థాపించి పదేళ్లు అవుతుంది. సినిమా హీరోగా భారీగా క్రేజ్ ఉన్న పవన్ కు రాజకీయాల్లో మాత్రం అనుకున్నంతగా ఆదరణ లభించలేదు. ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వస్తుందో అనేది ఆసక్తిగా మారింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాల్లో నటించారు. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరి హర వీరమల్లు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయో క్లారిటీ లేదు.

అసలు విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ వలే.. కోలీవుడ్ లో భారీగా క్రేజ్ ఉన్న హీరో విజయ్. ఇప్పుడు ఆయన కూడా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ప్రకటించారు. గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే.. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదు అని ప్రకటించిన తర్వాత విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. అలాగే ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని… తమిళనాడులో రెండేళ్లల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పార్టీ పెట్టినట్టు ప్రకటించారు.

దీంతో పవన్ కళ్యాణ్‌ కు జరిగినట్టే విజయ్ కు జరగనుందని కొంత మంది కాదు.. ఆదరణ బాగానే ఉంటుందని కొంత మంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మాత్రమే నెగ్గారు. పవన్ కళ్యాణ్ సైతం ఓడిపోవడం.. అది కూడా రెండు చోట్లా ఓడిపోవడం అభమానులను షాక్ కు గురిచేసింది. తమిళనాడులో కమల్ హాసన్ పార్టీ పెట్టడం.. ఆయనకు కూడా పవన్ కళ్యాణ్ కు జరిగినట్టే జరిగింది. ఇలాంటి టైమ్ లో విజయ్ పార్టీ పెట్టారు. మరి.. ఏం జరగనుందో చూడాలి.

Also Read: Instagram Edit Message: ఇంస్టాగ్రామ్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై మెసేజ్ ఎడిట్ చేయచ్చట?