పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఓ పక్క రాజకీయాలు, మరో పక్క సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. రాజకీయ షెడ్యూల్స్ లో ఖాళీ దొరికినప్పుడల్లా సినిమాలకు టైం ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎలాగైనా ఎలక్షన్స్ లోపు పవన్ చేతిలో ఉన్న మూడు సినిమాలు పూర్తి చేసేయాలని చూస్తున్నారు. కానీ ఏపీలో రాజకీయ పరిస్థితులు పవన్ షూటింగ్స్ కి బ్రేక్ వేస్తున్నాయి.
ఇటీవల కొన్ని రోజుల క్రితమే జనసేన(Janasena) వారాహి యాత్ర మూడో విడత పూర్తవ్వగానే ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమాకు డేట్స్ ఇచ్చి షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఏపీలో తాజాగా చంద్రబాబు(Chandrababu Arrest) అరెస్టుతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. పవన్ కళ్యాణ్ పాత్ర చాలా ముఖ్యంగా మారింది. చంద్రబాబు అరెస్ట్ అయిన రోజు పవన్ షూటింగ్ మధ్యలోనే ఆపేసి ఏపీకి బయలుదేరినట్టు సమాచారం. ఇక ఆ రోజు ఏపీకి పవన్ రావడానికి పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించారో తెలిసిందే.
నేడు పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుని కలవడానికి వెళ్తున్నారు. ఇలా ఏపీ రాజకీయాల్లో పవన్ మళ్ళీ బిజీ అవుతుండటంతో సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి, వాయిదా పడ్డాయి అని వార్తలు వచ్చాయి. చంద్రబాబు అరెస్టుతో మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాలు ఆగిపోయాయి అని అంతా భావించారు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ టీం షూట్ ఆగకుండా శరవేగంగా జరుగుతుంది అని ఇండైరెక్ట్ గా ఆ వార్తలకు సమాధానమిచ్చింది.
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ షూటింగ్ లో పోలీస్ డ్రెస్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోలని, హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ వర్కింగ్ స్టిల్స్ ని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుగుతుందని పోస్ట్ చేసింది. హరీష్ శంకర్ కూడా ఓ ఫోటో పోస్ట్ చేశాడు. ఓ పక్క పవన్ ఏమో ఏపీలో పొలిటికల్ గా బిజీగా ఉంటే వీళ్ళేమో పవన్ ఫోటోలు షేర్ చేసి షూటింగ్ ఫాస్ట్ గా జరుగుతుంది అని పెట్టడంలో ఆంతర్యం ఏంటో అని అనుకుంటున్నారు. ఏదైతే ఏముంది మాకు మాత్రం త్వరగా సినిమాలు రావాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక సెట్స్ నుంచి రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Brace yourselves boys & girls, here comes the #UstaadBhagatSingh 🤩🔥
The MOST AWAITED & CRAZY COMBO of @PawanKalyan & @harish2you is back on sets 🤘🏾😎
Non stop POWER PACKED SCHEDULE IN PROGRESS 🔥
@sreeleela14 @ThisIsDSP @DoP_Bose #AnandSai @ChotaKPrasad @SonyMusicSouth… pic.twitter.com/B8ZKVLTinj— Mythri Movie Makers (@MythriOfficial) September 13, 2023
Also Read : Hero Vishal : ఆ డైరెక్టర్ తో ఇంకెప్పటికీ కలిసి పనిచేయను.. విశాల్ ఆగ్రహం..