Site icon HashtagU Telugu

Pawan Kalyan : యాక్షన్ మొదలుపెట్టిన ఉస్తాద్ భగత్ సింగ్.. షూటింగ్స్ తో పవర్ స్టార్ బిజీ

Pawan Kalyan Ustaad Bhagat Singh Movie Acion Shoot Started

Pawan Kalyan Ustaad Bhagat Singh Movie Acion Shoot Started

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఓ పక్క రాజకీయాలు(Politics), ఓ పక్క సినిమాలతో(Movies) చాలా బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎలక్షన్స్(Elections) కి కొన్ని నెలల ముందే చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసేయాలని పవన్ రాత్రి పగళ్లు కష్టపడుతున్నాడు. రాజకీయాల్లో కొంచెం ఖాళి దొరకగానే సినిమాలకు డేట్స్ ఇస్తున్నాడు పవన్.

పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి షూటింగ్ జరగాల్సినవి. అన్ని మధ్యలో ఆగి ఉన్నాయి. OG సినిమాకి ఇంకొక షెడ్యూల్ ఇస్తే అది పూర్తయిపోతుంది. కానీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) కి పవన్ డేట్స్ ఇచ్చారు. ఎప్పుడో రెండేళ్ల క్రితం అనౌన్స్ చేసిన సినిమా ఇది. పవన్ రాజకీయాల వల్ల షూటింగ్ వాయిదాలు పడుతూ వస్తుంది. దీంతో ఈ సినిమాకి వరుసగా డేట్స్ ఇస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ జరగగా తాజాగా యాక్షన్ షెడ్యూల్ మొదలుపెట్టారు.

ఉస్తాద్ భగత్ సింగ్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ మొదలైందని, పవన్ కళ్యాణ్ సెట్ లోకి అడుగుపెట్టాడు అని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ త్వరగా పూర్తి చేసి సినిమా రిలీజ్ చేయాలని అభిమానులు కోరుతున్నారు.

 

Also Read : Anushka Reveal: బాహుబలి తర్వాత అందుకే గ్యాప్ తీసుకున్నా: మిస్ శెట్టి అనుష్క