Site icon HashtagU Telugu

Kamal Haasan : కమల్‌పై ప్రశంసలు కురిపిస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్

Pawan Kamal

Pawan Kamal

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్‌(Kamal Haasan)ను ఆస్కార్ అకాడమీ సభ్యుడిగా (Member of the Oscar Academy) ఎంపిక చేసిన విషయాన్ని చూస్తే భారతీయ సినిమా పరిశ్రమ గర్వపడాల్సిన ఘనత అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్వీట్ (Pawan Kalyan tweet) చేశారు. కమల్‌కు ఆస్కార్ అకాడమీలో చోటు దక్కడం భారతీయ చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణమని అన్నారు. ‘పద్మభూషణ్ కమల్ హాసన్ ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డ్స్ 2025 కమిటీ సభ్యుడిగా ఎంపిక కావడం ఇండియన్ సినీ ఇండస్ట్రీకే గర్వకారణం. 6 దశాబ్దాల పాటు అద్భుతమైన నటనతో అందరినీ అలరించారు. కమల్ గారు ఓ నటుడి కంటే ఎక్కువ. నటుడిగా, కథకుడిగా, దర్శకుడిగా ఆయన సినిమా ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ, దశాబ్దాల అనుభవం… భారతీయ, ప్రపంచ సినిమాపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి” అని , చిత్ర నిర్మాణంలోని ప్రతి అంశంపై కమల్ అసాధారణమైన ప్రతిభ నిజంగా స్ఫూర్తిదాయకం. ఆయన కళలో నిజమైన మాస్టర్. నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ప్రపంచ సినిమాకు ఆయన మరింత ప్రభావవంతమైన సేవ చేయాలని కోరుకుంటున్నా.’ అంటూ పవన్ ట్వీట్ చేసారు.

‘Mann ki Baat’ : తెలంగాణ మహిళలపై ప్రధాని మోడీ ప్రశంసలు

అలాగే కమల్‌తో పాటు ఆయుష్మాన్ ఖురానా, పాయల్ కపాడియా, మాక్సిమా బసు లాంటి ఇతర భారతీయ ప్రతిభా వంతులూ 534 మందితో చేసిన సభ్యత్వ జాబితాలో చోటు దక్కించడం భారతీయ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపుగా చెప్పవచ్చు. ఇక ఆస్కార్ అకాడమీ మెంబర్‌గా ఎంపిక కావడంపై కమల్ హాసన్ స్పందించారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో చేరడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. ‘ఈ గుర్తింపు నా ఒక్కడికే కాదు. భారతీయ చలనచిత్ర సమాజంతో పాటు నన్ను తీర్చిదిద్దిన లెక్కలేనన్ని డైరెక్టర్స్, రైటర్స్‌ అందరిది. భారతీయ సినిమా ప్రపంచానికి అందించడానికి చాలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా అనుబంధాన్ని మరింత పెంచుకోవాలని ఎదురుచూస్తున్నా. అకాడమీలో చేరిన నా తోటి యాక్టర్స్, టెక్నికల్ నిపుణులకు నా అభినందనలు.’ అంటూ ట్వీట్ చేసారు.