They Call Him OG : బ్యాలన్స్ షూట్‌కి ఓజి ఎప్పుడు వస్తాడు.. షూటింగ్ మొదలైదే అప్పుడే..!

బ్యాలన్స్ షూట్‌ పూర్తి చేయడం కోసం పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తున్నాడు. ఓజి మూవీ షూటింగ్ మొదలైదే అప్పుడే..!

Published By: HashtagU Telugu Desk
They Call Him OG

They Call Him OG

They Call Him OG : ఏపీ ఎన్నికల వల్ల పవన్ కళ్యాణ్ సినిమాలకు లాంగ్ బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు ఆ ఎన్నికలు ముగిసాయి. మొన్నటి వరకు రాజకీయ ప్రచారాలతో అలిసిపోయిన పవన్.. ప్రస్తుతం కొంచెం రెస్ట్ లో ఉన్నారు. అయితే రెస్ట్ పీరియడ్ ని ఎక్కువ కాలం ఉంచకుండా.. త్వరగానే సినిమా షూటింగ్స్ లో పాల్గొనున్నారట. ప్రెజెంట్ పవన్ చేతిలో ఉన్న హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు షూటింగ్ కొంత జరుపుకొని ఉన్నాయి.

అయితే వీటిలో ఓజి మూవీ షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది. ఈ మూవీని సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసారు. కాబట్టి త్వరగా ఆ బ్యాలన్స్ షూట్ ని పూర్తి చేస్తే.. చెప్పిన టైంకి సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉంది. వచ్చే నెల జూన్ నుంచి ఈ మూవీ షూటింగ్ ని పట్టాలు ఎక్కించనున్నారట. ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తరువాతే.. పవన్ ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తుంది.

కాగా ఈ సినిమాలోని తన పాత్ర చిత్రీకరణ పూర్తీ చేయడం కోసం పవన్.. కేవలం రెండు వారలు కాల్ షీట్స్ ఇస్తే చాలు సరిపోతుందని సమాచారం. ఇక ఈ షూటింగ్ ఫారిన్ లొకేషన్స్ లో ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చాలా కాలం తరువాత గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో ఈ మూవీని చేస్తుండడంతో.. అభిమానులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రియారెడ్డి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ సినిమాని రిలీజ్ చేస్తామంటూ నిర్మాతలు గతంలో అనౌన్స్ చేసారు.

  Last Updated: 17 May 2024, 05:58 PM IST