Site icon HashtagU Telugu

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘OG’ అదిరిపోయే అప్డేట్స్ ఇదిగో!

Og

Og

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నా.. మరోవైపు తన సినిమాలన వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. బ్రో మూవీని వేగంగా పూర్తి చేసిన పవన్ మరో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు బిజీగా ఉన్నాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు నటిస్తోన్న చిత్రాల్లో ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి. సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో యాక్షన్ జోనర్‌లో 1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుండటంతో హైప్ భారీగా ఏర్పడింది.

‘OG’ మూవీకి సంబంధించిన షూటింగ్ యాభై శాతం వరకూ పూర్తైంది. దీంతో ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ వరుసగా అప్‌డేట్లు ఇస్తూనే ఉంది. అయినప్పటికీ ఫ్యాన్స్ కోరుకునే పోస్టర్లు కానీ, టీజర్ కానీ విడుదల కాలేదు. అయితే  ‘OG’ సినిమాలో పవన్ కల్యాణ్ లుక్‌కు సంబంధించిన ఫస్ట్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయబోతుందట. దీన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే తెలిసింది.

ఇందులో పవన్ కల్యాణ్ వింటేజ్ లుక్‌తో దర్శనం ఇవ్వబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ‘OG’ మూవీకి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసే డేట్‌ను కూడా చిత్ర యూనిట్ ఖరారు చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 2వ తేదీన విడుదల కాబోతుందట. ఈ మేరకు ఇవాళ మేకర్స్ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. రౌడీలను చంపిన పవన్ తన అనచురులతో కలిసి వెళ్తున్నట్లు చూడొచ్చు.

Also Read: Mega Politics : పిచ్చుక ఫినిష్‌!సాయిపై`భోళా`శంఖం!!

Exit mobile version