Site icon HashtagU Telugu

Pawan and Sai Tej: అల్లుడి కోసం మామ.. సాయితేజ్ కెరీర్ గాడిన పడేనా!

Pawan And Sai Dharam Tej

Pawan And Sai Dharam Tej

రోడ్ ప్రమాదం నుండి బయటపడిన తేజ్ షూటింగ్ లో పాల్గొంటూ మళ్ళీ కెరీర్ పై దృష్టి పెడుతున్నాడు. విరూపాక్ష అనే సినిమాను కంప్లీట్ చేసి తాజాగా మావయ్య పవన్ తో చేస్తున్న సినిమా సెట్స్ లోకి వచ్చేశాడు. అయితే తేజ్ కి ప్రస్తుతం సక్సెస్ రేట్ తక్కువగా ఉంది. ప్రీవీయస్ మూవీస్ ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘రిపబ్లిక్’ సినిమాలు తేజ్ కి సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అంతకుముందు వినాయక్ తో చేసిన ఇంటెలిజెంట్ తేజ్ కి ఓ డిజాస్టర్ అందించింది.

అందుకే ఇప్పుడు తేజ్ కెరీర్ పై పవన్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. రిపబ్లిక్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన పవన్ ఇప్పుడు విరూపాక్ష ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాడు. ఇక వినోదాయ సీతమ్ రీమేక్ కూడా తేజ్ కోసమే చేస్తున్నాడు. ఇందులో తేజ్ పాత్రే కీలకం. ఇటీవలే ఆహా షోలో తేజ్ హెల్త్ గురించి పవన్ ఎంత కేర్ తీసుకున్నాడో బాలయ్య ద్వారా తెలియకనే తెలిసింది. అసలు తేజ్ ఇండస్ట్రీకి రావడం వెనుక ఉండి ముందుకు తోసిందే పవన్. ఏదేమైనా తేజ్ సినిమాలను ముందుకొచ్చి ప్రమోట్ చేయడం , తేజ్ కి ఓ బ్లాక్ బస్టర్ దక్కేలా ప్లాన్ చేస్తుండటం చూస్తుంటే సాయి ధరం తేజ్ కెరీర్ ను పవన్ ఘాడీలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు క్లియర్ గా తెలుస్తుంది.