Site icon HashtagU Telugu

Supriya : సెట్ లోంచి పారిపోతే పవన్ కళ్యాణ్ వచ్చి ఈ సినిమా చేయాల్సిందే అన్నారు..

Pawan Kalyan suggestion to supriya in Remove term: Akkada Aammayi Ikkada Abbayi Akkada Aammayi Ikkada Abbay movie

Pawan Kalyan

Supriya :  అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సుప్రియ. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సుప్రియ కూడా సినీ పరిశ్రమకు పరిచయమైంది. కానీ ఆ ఒక్క సినిమా చేసిన తర్వాత మళ్ళీ హీరోయిన్ గా సినిమాలు చేయలేదు. నటిగా సినిమాలు చేయకపోయినా సుప్రియ అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు చూసుకుంటూ, నిర్మాతగా కూడా బిజీగానే ఉంది.

తాజాగా సుప్రియ, మరో మహిళా నిర్మాత స్వప్నదత్, సీనియర్ నటి రాధిక కలిసి సోనీలివ్ ఓటీటీలో ప్రసారం అవుతున్న నిజం విత్ స్మిత షోకి వచ్చారు. సింగర్ స్మిత హోస్ట్ గా సోనీలివ్ ఓటీటీలో గత కొంతకాలంగా ఈ షో రన్ అవుతుంది. తాజాగా సుప్రియ, స్వప్న, రాధిక వచ్చిన ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు .

ఈ ప్రోమోలో సుప్రియ మాట్లాడుతూ.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా సెకండ్ షెడ్యూల్ లో నాలుగు సార్లు షూటింగ్ మధ్యలో పారిపోయాను. చివరికి పవన్ కళ్యాణ్ నా దగ్గరికి వచ్చి నువ్వు ఈ సినిమా ఒప్పుకున్నావు. పూర్తి అయ్యేదాకా చేయాల్సిందే, తప్పదు అని చెప్పాడు అని తెలిపింది. ఇక స్వప్నదత్ చిన్న ఏజ్ లోనే సినీ పరిశ్రమలోకి వచ్చాను. ఎక్కువగా డౌన్స్ చూశాను అని తెలిపింది. సుప్రియ ఎపిసోడ్ లో పవన్ గురించి, ఆ సినిమా గురించి ఇంకేం విషయాలు చెప్పిందో అని పవన్ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫుల్ ఎపిసోడ్ ఏప్రిల్ 14 నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది.

 

Also Read :    Guna Sekhar : మన తెలుగు హీరోలు అలా చేయరు.. బాలీవుడ్ హీరోలని పొగిడిన డైరెక్టర్..