Pawan Kalyan: తెలుగు చిత్ర పరిశ్రమ అందరిది.. ఏ ఒక్కరి సొంతం కాదు!

అంటే సుందరానికి....నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికీ ఈ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

  • Written By:
  • Updated On - June 10, 2022 / 11:57 AM IST

అంటే సుందరానికి….నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికీ ఈ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మూవీని పుల్ లెంగ్త్ కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా అంటే సుందానికి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 9 గురువారం సాయంత్రం హైదారాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ గెస్టుగా హాజరయ్యారు.

ఈసందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఇలాంటి వేడుకల్లో మీ ఉత్సాహం, ఉరకలు ఉండాలి లేదంటే ఏ కార్యక్రమానికి అందం ఉండదు. ఈ మూవీ ఫంక్షన్ కు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. నాని నటనే కాదు…ఆయన వ్యక్తిత్వం కూడా నాకు చాలా ఇష్టం. ఆయనకు భగవంతుడు మరిన్ని విజయాలు ఇవ్వాలి. నజ్రియా గారికి తెలుగు చిత్ర పరిశ్రమకు ఆహ్వానం పలుకుతున్నారు. మీరు బాగా చేశారని అంతా చెప్తుంటే చూడాలని వెయిట్ చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆర్టిస్టులందరికీ ధన్యవాదాలు. మూవీకి పని చేసిన వాళ్లందరికీ అభినందనలు. తెలుగు చిత్ర పరిశ్రమ అందరిది…ఏ ఒక్కరి సొత్తు కాదు. ప్రజల కోసం నిలబడే ధైర్యం , ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నిలబడే ధైర్యం మీరు ఇఛ్చారు…ఈ పరిశ్రమ ఇచ్చింది.

తెలుగు ఇండస్ట్రీలో రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా సినిమా వేరు…రాజకీయం వేరు. 24 క్రాప్టులు కలిస్తేవచ్చేదిసినిమా.కళకి కులం, మతం, ఉండదు. తెలుగు చిత్ర పరిమశ్రమ అంటే ఎంతో గౌరవం. నానికి మా ఇంట్లో ఎంతో మంది అభిమానులు ఉన్నారు.మా చెల్లి కూడా నానికి అభిమాని. త్వరలో హారీశ్ శంకర్ డైరెక్షన్ లో భవదీయుడు భగత్ సింగ్ మూవీ చేయబోతున్నాం…ఇది నాని , నజ్రియా, వివేక్ సినిమా. ఈ ఈవెంట్ లో నా ఏవీ వద్దు అన్నాను

నాట మాట వినలేదు. మూవీకి నానిహీరో. ఆయనే ముందు ఉండాలి. వేసినందుకు నాకు చాలా కోపంగా ఉంది. వేయకపోతే మీరు కోప్పడుతారని వేశారు అనుకుంటున్నాను. నా ఏవీ చూస్తే నాకే భయం వేసింది. రాజకీయాలే ఈజీగా ఉన్నాయి.సినిమాకష్టం. నాకు ఇష్టమైన ఆ డ్యాన్సులు చేయలేదు. మీకోసం కష్టపడి చేశారు. మీ అల్లరి తట్టుకోలేక డ్యాన్స్ చేస్తున్నాను. నాకు డ్యాన్స్ కుంటే నడవడం చాలా ఇష్టం. నడిచే అవకాశం ఇవ్వండది. క్షేమంగా ఇంటికి వెళ్లండి అందరూ అని తెలిపారు.