Mithun Chakraborty – Pawan Kalyan : ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తికి 2024 సంవత్సరానిగాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈవిషయాన్ని నేడు ఉదయం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. 80వ దశకంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో, డ్యాన్సులతో బాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగు వెలిగారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. అలాగే రాజకీయాల్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు.
మిథున్ చక్రవర్తి తెలుగులో గోపాల గోపాల(Gopala Gopala) సినిమాలో స్వామిజి పాత్రలో నటించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఆ సినిమాని గుర్తుచేసుకుంటూ మిథున్ చక్రవర్తికి స్పెషల్ గా శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ విడుదల చేసారు.
ఈ లేఖలో.. ప్రముఖ నటులు, రాజ్యసభ సభ్యులు శ్రీ మిథున్ చక్రవర్తి గారికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషాన్ని కలిగించింది. శ్రీ మిథున్ చక్రవర్తి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. హిందీ, బెంగాలీ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. 80వ దశకంలో దేశవ్యాప్తంగా యువతపై ఆయన ప్రభావం ఉంది. ‘డిస్కో డ్యాన్సర్’ చిత్రం ద్వారా ఆయన నృత్య శైలులు ఉర్రూతలూగించాయి. ‘ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్…’ అనే పాటను ఎవరూ మరచిపోలేరు. హిందీ చిత్రసీమలో శ్రీ అమితాబ్ బచ్చన్ గారి తరవాత అంత క్రేజ్ దక్కించుకున్న కథానాయకుడు శ్రీ మిథున్ చక్రవర్తి గారు. నేను నటించిన ‘గోపాల గోపాల’ సినిమాలో లీలాధర్ స్వామిగా కీలక పాత్ర పోషించారు. విద్యార్థి దశలో వామపక్ష భావజాలం కలిగిన ఆయన తరవాతి కాలంలో టీఎంసీ, అటు పిమ్మట బీజేపీలో చేరారు. దశాబ్ద కాలంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోనున్న శ్రీ మిథున్ చక్రవర్తి గారికి భగవంతుడు సంపూర్ణ సంతోషాన్ని, ఆయురారోగ్యాలను ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యులు శ్రీ మిథున్ చక్రవర్తి గారికి హృదయపూర్వక అభినందనలు – @PawanKalyan pic.twitter.com/nUexhEhQCA
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) September 30, 2024
Also Read : Getup Srinu : ‘దేవర’పై గెటప్ శ్రీను స్పెషల్ పోస్ట్.. ఎన్టీఆర్, జాన్వీతో దిగిన ఫోటో షేర్ చేసి..