Pawan Kalyan : నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో చిక్కుకొని గాయాలపాలైన సంగతి తెలిసిందే. సింగపూర్ లో చదువుకుంటున్న స్కూల్ లో అగ్ని ప్రమాదం జరగడంతో పవన్ తనయుడికి కాళ్ళు, చేతులకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళింది.
నిన్న పవన్ మీడియాతో మాట్లాడుతూ బ్రాంకో స్కోపీ చేస్తున్నారు, ICU లో ఉన్నాడు అని తెలిపారు. నిన్న రాత్రి పవన్ కళ్యాణ్, చిరంజీవి, చిరంజీవి భార్య సురేఖ సింగపూర్ కి వెళ్లారు. నేడు ఉదయం పవన్ తన కొడుకుని కలిశారు. అనంతరం తన కొడుకు హెల్త్ అప్డేట్ ఇక్కడి మీడియాకు సమాచారం అందించారు.
పవన్ అందించిన సమాచారం ప్రకారం.. మార్క్ శంకర్ కి సింగపూర్ లోని ఆసుపత్రిలో ఇంకా చికిత్స కొనసాగుతోంది. చేతులు, కాళ్ళకు కాలిన గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తులకు పొగ చూరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. అక్కడి వైద్యులు, అధికారులతో పవన్ మాట్లాడారు. మార్క్ కోలుకొంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. భారత కాలమాన ప్రకారం నేడు బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకువచ్చారు. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు చెప్పినట్టు తెలిపారు.
దీంతో మరో మూడు రోజులు పైనే పవన్ అక్కడే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. పవన్ తనయుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు.
Also Read : Sapthagiri : సినీ పరిశ్రమలో విషాదం.. హీరో తల్లి కన్నుమూత..