Akira Nandan : అప్పుడు కళ్యాణ్.. మొన్న చరణ్.. నేడు అకిరా.. ఇది గమనించారా..?

అప్పుడు బాబాయ్, మొన్న అబ్బాయి, నేడు తనయుడు ఏం ర్యాగింగ్ చేస్తున్నారు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఇది గమనించారా..?

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan Son Akira Nandan Dress Color Gone Viral

Pawan Kalyan Son Akira Nandan Dress Color Gone Viral

Akira Nandan : ఈ ఎన్నికల ప్రచారాలతో రాజకీయాల్లో కూడా ర్యాగింగ్ చేయొచ్చు అని పవన్ కళ్యాణ్ తెలియజేసారు. విమర్శలకు, కౌంటర్స్ కి వ్యగ్యంగా సమాధానాలు ఇస్తూ పాలిటిక్స్ లో ఓ కొత్త ట్రెండ్ ని తీసుకు వచ్చారు. ఈ ట్రెండ్ ని పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేస్తే.. జనసైనికులు, అభిమానులతో పాటు మెగా కుటుంబ సభ్యులు కూడా ముందుకు తీసుకు వెళ్తూ వైరల్ చేసారు. బాబాయ్ చేసిన ఒక విషయాన్ని.. ఇటీవల అబ్బాయి రామ్ చరణ్ చేసి వైరల్ అవ్వగా, నేడు అదే పనిని తనయుడు అకిరా కూడా చేసి వైరల్ అవుతున్నారు.

ఇంతకీ ఆ పని ఏంటని ఆలోచిస్తున్నారా..? అదేనండి గతంలో వారాహి కలర్ ని కామెంట్ చేస్తూ వైసీపీ లీడర్స్ కామెంట్స్ చేయగా.. పవన్ కళ్యాణ్ వారికీ వ్యగ్యంగా జవాబు ఇస్తూ అదే కలర్ డ్రెస్ తో ఏపీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం వెళ్లిన రామ్ చరణ్.. కింద నుంచి పై వరకు అదే రంగు డ్రెస్ ని వేసుకొని వెళ్లారు. ఇది గమనించిన జనసైనికులు, చరణ్ అభిమానులు.. దానిని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసారు. తాజాగా అకిరా కూడా అలాంటి రంగు డ్రెస్ లోనే కనిపించి థ్రిల్ చేస్తున్నాడు.

నేడు వచ్చిన ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. రేణూదేశాయ్ వద్ద ఉంటున్న అకిరా నందన్.. తన తండ్రి విజయాన్ని దగ్గరుండి ఎంజాయ్ చేయడం కోసం పవన్ ఇంటికి చేరుకున్నాడు. అయితే వచ్చేటప్పుడు వారాహి కలర్ డ్రెస్ లో రావడం అందర్నీ ఆకర్షిస్తుంది. దీంతో కలర్ విషయం మరోసారి వైరల్ గా మారింది. అప్పుడు బాబాయ్, మొన్న అబ్బాయి, నేడు తనయుడు ఏం ర్యాగింగ్ చేస్తున్నారు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

  Last Updated: 04 Jun 2024, 05:29 PM IST